బడ్జెట్ విమానయాన సంస్థ 'ఇండిగో' మరో భారీ డిస్కౌంట్ ఆఫర్ను తీసుకొచ్చింది. "ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్ పేరుతో" అత్యంత తక్కువ ధరకు దేశీయ, అంతర్జాతీయ విమానయానానికి టికెట్లు విక్రయిస్తోంది.
ఈ ఆఫర్లో దేశీయ విమానయాన ఛార్జీలు రూ.899, అంతర్జాతీయ విమాన ఛార్జీలు రూ.2,999 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది ఇండిగో. డిసెంబర్ 23 నుంచి 26 వరకు ఈ ఆఫర్ ఆందుబాటులో ఉండనుంది. 2020 జనవరి 15 నుంచి 2020 ఏప్రిల్ 15 మధ్య ప్రయాణం చేయాలనుకునేవారికి మాత్రమే 'ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్' ఆఫర్ వర్తించనుంది. అన్ని ఛానెళ్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఇండిగో తెలిపింది.