తెలంగాణ

telangana

నిధులు సేకరించే పనిలో ఐడీబీఐ

By

Published : Mar 20, 2019, 12:09 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4వేల కోట్ల నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐడీబీఐ బ్యాంకు ప్రకటించింది. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్రెంచ్​లకు బాండ్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సేకరించనున్నట్లు బ్యాంకు పేర్కొంది.

ఐడీబీఐ

మూలధనానికి రూ. 4వేలకోట్ల నిధులను సమకూర్చుకోనున్నట్లు ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకు ప్రకటించింది. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ట్రెంచ్​లకు బాండ్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో సమకూర్చుకోవాలని బ్యాంకు భావిస్తోంది. మంగళవారం జరిగిన సమావేశంలో బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఇందుకు అనుమతించిందని నియంత్రణ సంస్థకు నివేదించింది.

బ్యాంకు ఎండీ, సీఈఓగా రాకేశ్​ శర్మ పదవీ కాలాన్ని పొడగిస్తూ తాజా నియమకానికి డైరెక్టర్ల బోర్డు అనుమతించినట్లు పేర్కొంది ఐడీబీఐ. దీంతో పాటు బ్యాంకు అదనపు డైరెక్టర్​గానూ ఆయన కొనసాగనున్నారు. ఈ నియామకానికి ఆర్బీఐ అనుమతి కూడా లభించింది. రాకేశ్​ శర్మ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.

ABOUT THE AUTHOR

...view details