రూ.45 లక్షల లోపు గృహ నిర్మాణాలు బిల్డర్లతో పాటు, కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారాయి. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకుమధ్యతరగతి ప్రజలను ప్రోత్సహించేలా 2019 బడ్జెట్‌కు రూపకల్పన చేశారని స్థిరాస్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రూ.45 లక్షల లోపు ఇళ్లు కొనుగోలు చేసేవారికి దాదాపు రూ. 3.5 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ లభించేలా బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్ల నుంచి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరతను తీర్చేందుకు కేంద్రం ప్రయత్నించిందని అంటున్నారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల నేపథ్యంలో స్థిరాస్తి డెవలపర్లు అందుబాటు ధరలో ఉన్న గృహ విభాగంపై దృష్టి సారించారు.
ప్రభుత్వ ప్రోత్సాహం...
మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారికి ప్రభుత్వం జీఎస్టీని 8 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించి మరింత ప్రోత్సాహం ఇస్తుంది. రూ. 45 లక్షల లోపు (60 చదరపు మీటర్లు మెట్రో నగరాల్లో, ఇతర ప్రాంతాల్లో 90 చదరపు మీటర్లు) విలువ చేసే గృహాలపై రూ. 3.5 లక్షల వరకు వడ్డీ రేటు మినహాయింపు ప్రకటించింది. గతంలో ఇది రూ. 2 లక్షలుగా ఉండేది.
ఈ రకమైన గృహాలకు పన్ను మినహాయింపులతో పాటు అందుబాటు ధరలో ఉండడం వల్ల డిమాండ్ కూడా పెరిగింది. టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో ఈ ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ముంబయి, దిల్లీ, పుణె వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో వీటి డిమాండ్ బాగా పెరిగిపోయింది.
ఇదీ చూడండి:'సీతాకోక చిలుక' టీ పొడి... కిలో రూ.75వేలే!