తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో సంపన్న మహిళగా రోష్నీ నాడార్

దేశంలోనే సంపన్న మహిళగా హెచ్​సీఎల్ టెక్నాలజీస్ ఛైర్​పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా రికార్డుకెక్కారు. రూ. 54,850 కోట్ల నికర ఆస్తితో తొలిస్థానంలో నిలిచారు. రూ. 36,600 కోట్లు విలువైన ఆస్తులతో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందర్ షా రెండో స్థానంలో ఉన్నారు.

HCL's Roshni Nadar richest woman in India; a third of entrants in list self-made
దేశంలో సంపన్న మహిళగా రోష్నీ నాడార్

By

Published : Dec 3, 2020, 7:08 PM IST

ఐటీ దిగ్గజం హెచ్​సీఎల్ టెక్నాలజీస్ ఛైర్​పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా దేశంలోనే సంపన్నమైన మహిళగా నిలిచారు. రూ. 54,850 కోట్ల ఆస్తితో ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. రూ. 36,600 కోట్ల నికర ఆస్తితో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందర్ షా రెండో స్థానంలో ఉన్నారు.

వంద మంది సంపన్న మహిళలతో కూడిన ఈ జాబితాను హురున్ ఇండియా, కోటక్ వెల్త్ సంయుక్తంగా రూపొందించాయి. జాబితాలోని 31 మంది మహిళల నికర ఆస్తుల విలువ కనీసం వంద కోట్లుగా ఉంది. వీరిలో ఆరుగురు ప్రొఫెషనల్ మేనేజర్లు, 25 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు.

అందులో మజుందర్ ముందు

సెల్ఫ్ మేడ్ కేటగిరీలో మజుందర్ షా ప్రథమ స్థానంలో ఉండగా.. జోహోకు చెందిన రాధా వెంబు(రూ. 11,590 కోట్ల నికర విలువ), అరిస్తా నెట్​వర్క్స్​కు చెందిన జయశ్రీ ఉల్లాల్(రూ.10,220 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరంతా హురున్ సంస్థ రూపొందించే ప్రపంచవ్యాప్త ధనిక మహిళల జాబితాలోనూ చోటు దక్కించుకోవడం విశేషం.

  • ఈ జాబితాలో ఉన్న మహిళల సగటు వయసు 53.
  • వీరందరి నికర ఆస్తి మొత్తం రూ. 2.72 లక్షల కోట్లు
  • వంద మందిలో 19 మంది మహిళల వయసు 40 లోపే.
  • అపోలో హాస్పిటల్స్​ ఎంటర్​ప్రైస్ నుంచి నలుగురు మహిళలు, గోద్రెజ్ గ్రూప్​నకు చెందిన ముగ్గురు మహిళలు ఇందులో చోటు దక్కించుకున్నారు.

స్టార్టప్​లను స్థాపించిన ఇద్దరు మహిళలకు ఇందులో స్థానం లభించింది. నైకా వ్యవస్థాపకులు ఫాల్గునీ నాయర్ రూ.5,410 కోట్లు, బైజుస్ స్థాపకుడు రవీంద్రన్ భార్య దివ్య గోకుల్​నాథ్​ రూ.3,490 కోట్లతో ఈ జాబితాలో చోటు సంపాదించారు.

ABOUT THE AUTHOR

...view details