తెలంగాణ

telangana

ETV Bharat / business

సెప్టెంబర్​లో అత్యల్ప జీఎస్టీ వసూళ్లు - తగ్గిన జీఎస్టీ వసూళ్లు

ఆగస్టుతో పోలిస్తే.. సెప్టెంబర్​లో జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గాయి. సెప్టెంబర్​లో రూ.91,916 కోట్ల వసూళ్లు మాత్రమే నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

జీఎస్టీ

By

Published : Oct 1, 2019, 6:20 PM IST

Updated : Oct 2, 2019, 6:53 PM IST

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్​లో గణనీయంగా తగ్గాయి. సెప్టెంబర్​లో కేవలం రూ.91,916 కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు సెప్టెంబర్​లో నమోదైన వసూల్లే అత్యల్పం.​

ఈ ఏడాది ఆగస్టులో రూ.98,202 కోట్ల జీఎస్టీ వసూలవ్వగా.. గత ఏడాది సెప్టెంబర్​లో రూ.94.442 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

సెప్టెంబర్​లో జీఎస్టీ వసూళ్ల వివరాలు..

  • మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.91,916 కోట్లు
  • కేంద్ర జీఎస్టీ-రూ.16,630 కోట్లు
  • రాష్ట్రాల ​జీఎస్టీ-రూ.22,598 కోట్లు
  • సమీకృత​ జీఎస్టీ-రూ.45,069 కోట్లు

ఇదీ చూడండి: భారత్​కు శాంసంగ్ మడత ఫోన్- ధరెంతో తెలిస్తే షాక్​!

Last Updated : Oct 2, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details