అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొనుగోలుకు బిడ్లు దాఖలు చేసేందుకు మరింత గడువు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత గడువు శుక్రవారం (అక్టోబర్ 30)తో ముగియనుంది. అయితే డిసెంబర్ 14 వరకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా అప్పుల విషయంలో కొనుగోలుదారుకు మరింత ఊరటనిచ్చే యోచనలో భాగంగా గడువు పెంపు ఉండనున్నట్లు వివరించాయి.