ఏజీఆర్ వ్యవహారంలో టెలికాం సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. బకాయిలకు సంబంధించి స్వీయ మదింపు వివరాలు అందించాలని టెల్కోలను ప్రభుత్వం అడిగినట్లు సమాచారం.
'ఏజీఆర్ బకాయిలు మీరు ఎలా లెక్కించారు?' - ఏజీఆర్ బకాయిలు
ఏజీఆర్ బకాయిలకు సంబంధించి స్వీయ మదింపు వివరాలు అందించాలని టెల్కోలను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పత్రాల ఆధారంగా బకాయిలను సులభంగా లెక్కించవచ్చని టెలికాం శాఖ భావిస్తున్నట్లు సమాచారం.
టెలికాం సంస్థలు
వివిధ టెలికాం సర్కిళ్లలో లెక్కింపులు భిన్నంగా ఉన్నాయని ప్రభుత్వం నిర్ధరించింది. ఫలితంగా బకాయిలను ప్రభుత్వం మళ్లీ లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టెలికాం సంస్థలు స్వీయ మదింపు వివరాలు అందిస్తే లెక్కింపు మరింత సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సంబంధిత పత్రాలు అందించాలని భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్లను టెలికాం శాఖ ఆదేశించినట్లు సమాచారం.
Last Updated : Mar 2, 2020, 10:35 AM IST