తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ రూల్స్​ ఎఫెక్ట్​- గూగుల్​ నుంచి అవన్నీ మాయం

మే నెలాఖరు నుంచి అమలులోకి వచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా కంటెంట్​ విషయంలో చర్యలు ప్రారంభించింది గూగుల్. యూజర్లు ఫిర్యాదు, రిపోర్ట్ చేసిన కంటెంట్​ను తొలగిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను నెలవారీ నివేదికలో విడుదల చేసింది.

Google action with New IT rules
సెర్చ్ ఇంజన్ గూగుల్​

By

Published : Jul 30, 2021, 12:44 PM IST

Updated : Jul 30, 2021, 5:12 PM IST

యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు.. మేలో 71,132 పోస్ట్​లు/ఆర్టికల్స్​ను.. జూన్​లో 83,613 పోస్ట్​లు/ఆర్టికల్స్​ను తమ ప్లాట్​ఫామ్​ నుంచి తొలగించినట్లు సెర్చ్​ ఇంజన్ దిగ్గజం గూగుల్​ శుక్రవారం ప్రకటించింది. దీనితోపాటు.. యూజర్లు రిపోర్ట్​ చేసిన.. 6,34,357 (మేలో), 5,26,866 (జూన్​లో) అభ్యంతరకర అంశాలను తొలగించినట్లు నెలవారీ 'ట్రాన్స్​పరెన్సీ రిపోర్ట్​'లో పేర్కొంది.

మే 26 నుంచి అమలులోకి వచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా.. ఈ చర్యలకు ఉపక్రమించినట్లు గూగుల్ స్పష్టం చేసింది.

వ్యక్తిగత యూజర్ల నుంచి.. మేలో 34,883, జూన్​లో 36,265 ఫిర్యాదులు వచ్చినట్లు గూగుల్​ వెల్లడించింది.

తమ ప్లాట్​ఫామ్​​ నుంచి తొలగించిన కంటెంట్​లో(జూన్​ నెలకు).. కాపీరైట్ (83,054), ట్రేడ్​మార్క్​ (532), నకిలీ (14), మోసాలు (4), ఇతర చట్టపరమైన (2), పరువు నష్టం (1), గ్రాఫిక్ అశ్లీల కంటెంట్​ (1) క్యాటగిరీలు ఉన్నట్లు తెలిపింది గూగుల్​.

ఆటోమేటెడ్ డిటెక్షన్ వ్యవస్థ ద్వారానే ఈ కంటెంట్​ను తొలగించినట్లు పేర్కొంది గూగుల్​.

గూగుల్ 'పారదర్శకత నివేదిక'ను 2010 నుంచే విడుదల చేస్తూ వస్తోంది. యూట్యూబ్​లో తొలగించిన కంటెంట్​ గురించి త్రైమాసికాల వారీగా వివరాలు వెల్లడిస్తుంది.

ఇదీ చదవండి:ఐఫోన్‌ టు ఆండ్రాయిడ్..ఛాట్ ట్రాన్స్‌ఫర్ చిక్కులు లేనట్లే!

Last Updated : Jul 30, 2021, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details