ప్రజారవాణాకు ఉపయోగపడే సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది టెక్ దిగ్గజం గూగుల్. గూగుల్ మ్యాప్స్ ద్వారా రైళ్లు, బస్సుల సమాచారాన్ని లైవ్లో తెలుసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.
దేశంలో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, పుణే, లఖ్నవూ, మైసూర్, కోయంబత్తూర్, సూరత్ల్లో (పది నగరాలు) అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది గూగుల్.
మ్యాప్స్ ద్వారా బస్సుల రాకపోకల సమయాలను తెలుసుకోవచ్చు. లైవ్ ట్రాఫిక్ ఆధారంగా బస్సులు ఆలస్యమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా లెక్కించి వినియోగదారులకు సమాచారం అందిచనుంది గూగుల్.