సాధారణంగా అంతర్జాలంతో ఏదైనా వెతుకుతున్నప్పుడు నెట్వర్క్ సరిగా లేకపోతే ఫలితాలు రావడం ఆలస్యమవుతుంది. లేదంటే ఒక్కోసారి చిన్నపాటి తప్పిదం సందేశం చూపిస్తుంది. అలాంటి సమయంలో నెటిజన్లకు విసుగు వస్తుంది. అందుకే అలాంటి భావాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కొన్ని ఫీచర్లను జోడించింది గూగుల్.
ఇందులో కొన్ని ప్రయత్నించే విధంగా ఉండి బాగా ఆకట్టుకుంటాయి. ఈ ఫీచర్లను 'ఈస్టర్ ఎగ్స్' అంటారు. ఇవి బ్రౌజర్‌తో కలిసి ఉండే చిన్నపాటి కోడింగ్. చిన్నపాటి పజిల్స్, మ్యాజిక్ ట్రిక్స్ ఇందులో ఉంటాయి.
- బ్లింక్(<blink>): ఈ ఫీచర్ రాకముందు గూగుల్ సాధారణ సెర్చ్ఇంజన్. అయితే బ్లింక్‌తో చిన్నపాటి ఫన్ను కలిపింది గూగుల్. ఇది మీరు ట్రై చేయాలంటే '<బ్లింక్>' <blink> అని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేయాలి. బ్లింక్ అనే పదం ఎక్కడ ఉంటే అక్కడ ఈ ఫీచర్ ఆటోమెటిక్‌గా అప్లై అవుతుంది.
- డూ ఎ బ్యారెల్ రోల్(do a barrel roll): గూగుల్ ఈస్టర్ ఎగ్స్‌లో ఇది పాతది. అయినా ఇప్పటికీ అందరికి నచ్చే ఫీచర్. "do a barrel roll" అని సెర్చ్‌లో టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే... స్క్రీన్ ఫలితాలు రెండు సార్లు గిర్రున తిరుగుతాయి. మొదట వచ్చిన ఫలితంపై క్లిక్ చేయగానే గూగుల్ (google ) పేరు రివర్స్‌లో ఎల్గూగ్(elgoog) పేరుతో ఈస్టర్ ఎగ్స్ ఇమేజ్‌లు, వీడియోలు దర్శనమిస్తాయి.
- డైనోసార్ గేమ్: క్రోమో బ్రౌజర్ వాడుతున్నవారు ఎక్కువగా ఈ గేమ్ చూస్తుంటారు. నెట్వర్క్ లేనపుడు ఆఫ్‌లైన్‌లో ఆడుకునేవిధంగా దీన్ని రూపొందించారు. దీన్నే టీరెక్స్ రన్ అంటారు.
- టిక్ టాక్ టాయ్: "tic tac toe" అని గూగుల్‌లో టైప్ చేయాలి. చిన్నపాటి ఎక్స్ అండ్ ఓ గేమ్ వస్తుంది.
- యాస్క్యూ(askew): ఇది సెర్చ్‌లో టైప్ చేయగానే స్కీన్ సగం వంగిపోయి కనిపిస్తుంది.
- అటరి బ్రేకవుట్(atari breakout): ఇది 1970లో ఓ ప్రఖ్యాత గేమ్. ఇది టైప్ చేసి గూగుల్ ఇమేజ్ ట్యాబ్ మీద నొక్కగానే గేమ్ ప్రత్యక్షమవుతుంది.
- గూగుల్ గ్రావిటీ(Google Gravity): ఈ పదాన్ని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేసి మొదట వచ్చిన రిజల్ట్ మీద క్లిక్ చేస్తే అంతా బ్రేక్ అయిపోతుంది.
- జెర్గ్ రష్(zerg rush): సెర్చ్ చేసిన రిజల్ట్స్ అన్ని మాయమైపోయి చివరికి జీజీ అనే అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి.