తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్ సీఈఓ​ పిచాయ్ క్షమాపణ

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ క్షమాపణలు చెప్పారు. గత వారం.. గూగుల్​ కృత్రిమ మేధ(ఏఐ) విభాగంలో కీలక ఉద్యోగి టిమ్‌నిట్‌ గెబ్రూ నిష్క్రమణతో చెలరేగిన దుమారం నేపథ్యంలో పిచాయ్​ వివరణ ఇచ్చారు. ఈ అంశాన్ని సంస్థ సమీక్షిస్తుందని తెలిపారు.

Google CEO Sundar Pichai has apologised
సుందర్​ పిచాయ్ క్షమాపణ

By

Published : Dec 10, 2020, 11:10 AM IST

గూగుల్ కృత్రిమ మేధ(ఏఐ) విభాగంలో కీలక ఉద్యోగి టిమ్‌నిట్‌ గెబ్రూ నిష్క్రమణతో చెలరేగిన దుమారంపై సంస్థ సీఈఓ సుందర్​ పిచాయ్ క్షమాపణలు చెప్పారు. గెబ్రూ నిష్క్రమణకు దారితీసిన అంశాలను కంపెనీ సమీక్షిస్తుందని ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

ఓ పరిశోధన పత్రం విషయంలో సంస్థ యాజమాన్యానికి, గెబ్రూకు తెలత్తిన విభేదాల కారణంగా అమె గత వారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే కంపెనీ తనను తొలగించినట్లు అమె ఆరోపించగా.. గూగుల్ మాత్రం గెబ్రూ రాజీనామా చేసినట్లు తెలిపింది.

ఈ విషయంపై స్పందించిన సుందర్ పిచాయ్.. గెబ్రూది రాజీనామానా, తొలగింపా అనే విషయాన్ని ప్రస్తావించకుండా.. "ప్రభావవంతమైన నల్ల జాతి మహిళా నాయకురాలు గూగుల్ నుంచి అసంతృప్తిగా వైదొలగడంపై మేము నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అన్నారు.

గెబ్రూ విమర్శ..

సుందర్​ పిచాయ్​ వివరణపై గెబ్రూ విమర్శలు చేశారు. ఇందులో తనకు జవాబుదారీతనం కనిపించలేదని పేర్కొన్నారు. తనకు జరిగినదానికి క్షమాపణ లభించలేదని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఉద్యోగి నిష్క్రమణతో గూగుల్​లో దుమారం ఇది..

ABOUT THE AUTHOR

...view details