తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: మీ పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోండి ఇప్పుడే - బాండ్లు

ఎవరైన సంపాదిస్తున్నారంటే కచ్చితంగా ఎంతో కొంత భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేయటం సాధారణం. అయితే ఎక్కడ మదుపు చేయాలి? వేటిలో మంచి లాభాలు వస్తాయి? మదుపు చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే.

పెట్టుబడి సాధానాలు

By

Published : Jun 4, 2019, 10:00 AM IST

పొదుపు.. అనే విషయంపై పెట్టుబడుల దిగ్గజం వారెన్ బఫెట్ ఓ ఆర్థిక సూత్రం చెప్పారు. సంపాదించిన దాంట్లో ఖర్చుపెట్టగా మిగిలింది పొదుపుచేయడం కాదు.. పొదుపు చేయగా మిగిలింది ఖర్చు పెట్టాలి అని. ఆర్థికంగా ఎదగాలంటే ఇది చాలా ముఖ్యమంటారు ఆయన.

పొదుపు అనగానే.. బ్యాంకులో పొదుపు ఖాతాలో డబ్బు దాచుకోవడం.. వడ్డీలకు ఇవ్వడం వంటి సాంప్రదాయ మార్గాలకు మొగ్గు చూపుతారు చాలామంది. అయితే ఇప్పుడు పొదుపు ద్వారా అధికంగా లాభాలు పొందేందుకు ఆదాయానికి తగ్గట్లు అందుబాటులో ఉండే కొన్ని పెట్టుబడి మార్గాలపై ఓ ప్రత్యేక కథనం మీ కోసం.

ఫిక్స్డ్ డిపాజిట్

ఫిక్స్​డ్​ డిపాజిట్

ఇది సాంప్రదాయంగా పొదుపు ఖాతాలో డబ్బు దాచుకోవడం వంటిదే. ఇందులో మీరు జమ చేసిన మొత్తాన్ని మీ ఖాతా ఉన్న బ్యాంకు వడ్డీ రేట్లను బట్టి ప్రతి నెల మీకు వడ్డీ లభిస్తుంది. ఇందులో మీ సొమ్ము సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు కచ్చితమైన ఆదాయం ఉంటుంది.

నిర్ణీత సమయానకి ఫిక్స్డ్​ డిపాజిట్​ను తీసుకుంటాయి బ్యాంకులు. మధ్యలో ఏదైన కారణం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్​లోని సొమ్మును తిరిగి తీసుకోవాలంటే మాత్రం బ్యాంకులకు పెనాల్టీ కట్టాల్సిందే. ఈ విషయాన్ని ముందుగా తెలుకుని ఫిక్స్​డ్ డిపాజిట్లు చేయాలి.

అన్ని రకాల ఆదాయ మార్గాల వారు పొదుపు చేయొచ్చు. రిస్క్​ తీసుకోకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇది సరైన పెట్టుబడి సాధనం.

పోస్టాఫీస్ పోదుపు ఖాతా

పోస్టాఫీస్ పోదుపు ఖాతా

పోస్టాఫీసు పొదుపు ఖాతా అనేది అందరికి అందుబాటులో ఉండే సులభమైన పొదుపు మార్గం. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లకన్నా ఇంకాస్త ఎక్కువ ఆదాయం వస్తుండటం గమనార్హం.

పోస్టాఫీసులో ఆదాయ మార్గాలు, ఆదాయ మొత్తాలను బట్టి వివిధ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు సుకన్య సమృద్ధి, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్​ పథకం వంటివి.

చిన్న వ్యాపారులు, తక్కువ ఆదాయం ఉన్న వారు ఇందులో పొదుపుచేయడం మేలు.

బంగారంపై మదుపు

బంగారంపై మదుపు

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండు అంతా ఇంతా కాదు. చాలా మంది ధర తగ్గినప్పుడు బంగారం కొని ధర పెరిగిప్పుడు తిరిగి అమ్మేస్తుంటారు.

అయితే ఇలా భౌతికంగా కొని దాచడం కష్టతరం.. ఇందుకోసం ఇప్పుడు గోల్డు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బంగారాన్ని డాక్యుమెంట్ల రూపంలో కొనుగోలు చేసి సరైన లాభం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు.

ఇందులో ఉన్న రిస్క్ అంతా బంగారం ధరలో మార్పులు. వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే బంగారంపై పెట్టుబడి లాభసాటి మార్గమే.

ఆదాయం ఎక్కువగా ఉండి.. అత్యవసరాలకు పెట్టుబడి పెట్టిన డబ్బు అవసరం రాదనుకున్న వారు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు.

కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లు

కంపెనీల ఫిక్స్​డ్​ డిపాజిట్లు

చిన్న మదుపర్ల దగ్గర నుంచి కంపెనీలు నిధులను సేకరించే సాధనాలే ఈ ఫిక్స్​డ్ డిపాజిట్లు. ఏడాదికి మించి మీ పెట్టుబడి గురించి ఆలోచించకుండా ఉంటేనే ఈ మార్గాన్ని ఎంచుకోవాలి.

అయితే వీటిలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ పని తీరు దాని ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. మంచి రేటింగ్ ఉన్న కంపెనీని ఎంచుకుని నష్టభయాలను అదిగమించొచ్చు.

కొంచెం రిస్క్ అయినా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకునేవారికి ఇది సరిపోతుంది.

మ్యూచువల్​ ఫండ్లు

మ్యూచువల్​ ఫండ్లు

మ్యూచువల్​ ఫండ్లు అనేవి కాస్త రిస్క్​తో కూడకున్నా.. మంచి ఆదాయన్నిచ్చే మార్గం అనే చెప్పాలి. చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వారి నుంచి డబ్బు సేకరించి ఈక్విటీ మార్కెట్లు, బాండ్ల రూపంలో పెద్ద సంస్థల్లో పెట్టుబడి పెడతాయి. వీటికి నిపుణులు ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. వీటి పెట్టబడులను ఎప్పటికప్పడు వారు పర్యవేక్షిస్తుంటారు.

అధికంగా పెట్టుబడి పెట్ట గలిగి.. వాటి నిర్వహణకు ఎక్కువ సమయం కేటాయించలేని వారికి మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయి.

ఈక్విటీ మార్కెట్లు

ఈక్విటీ మార్కెట్లు

ఈక్విటీ మార్కెట్లలో పెట్టబుడి అనేది రిస్కు ఎక్కువగా ఉండే పెట్టుబడి మార్గం. అయితే స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉంటేనే వీటిని ఎంచుకోవడం మంచిది. అలా ఉంటే నేరుగా గానీ బ్రోకరేజి సంస్థల నుంచి కానీ స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టబడి పెట్టొచ్చు. ఇందులో లాభనష్టాలకు సమాన స్థాయిలో అవకాశాలు అంటాయి. అయితే ఓపిగ్గా వీటిపై దృష్టి సారిస్తే మాత్రం భారీ లాభాలు ఆర్జించొచ్చు.

భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి.. ఎప్పటికప్పుడు వాటి నిర్వహించే వారికి ఈ పెట్టుబడి మార్గం సరిపోతుంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయపన్నులో మినహాయింపులు కోరొచ్చు.

వీటితో పాటు స్థిరాస్తి కొనుగోలు వంటి లాభసాటి మార్గాలున్నాయి.. అయితే వాటిలో లాభాలు పొందాలంటే ఎక్కువకాలం వేచి చూడాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టిన డబ్బుతో ఇప్పుడప్పుడే అవసరం లేదనుకునే వాళ్లు వీటిని ఆశ్రయించడం మేలు.

ABOUT THE AUTHOR

...view details