తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం ధర కొత్త రికార్డ్- నేడు ఎంత పెరిగిందంటే..?

పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. నేడు బులియన్ మార్కెట్లు ముగిసే సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.38,770కి చేరింది. వెండి మాత్రం కిలోకు రూ.1,100 తగ్గింది.

రికార్డు స్థాయికి పసిడి ధర

By

Published : Aug 20, 2019, 7:00 PM IST

Updated : Sep 27, 2019, 4:39 PM IST

పుత్తడి ధరలు రోజురోజుకూ కొత్త శిఖరాలకు చేరుతున్నాయి. బులియన్ మార్కెట్లో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.200 పెరిగింది. ఈ కారణంగా 10 గ్రాముల పసిడి ధర ఆల్​ టైం రికార్డు స్థాయిల వద్ద రూ.38,770గా నమోదైంది.

నగల వ్యాపారుల నుంచి డిమాండు అధికంగా ఉన్న కారణంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయని బులియన్ ట్రేడర్లు అంటున్నారు. రూపాయి బలహీనతలూ పసిడి పరుగులకు ఊతమందించాయని పేర్కొన్నారు.

వెండి మాత్రం కిలోకు రూ.1,100 తగ్గింది. ఫలితంగా కిలో వెండి ధర రూ.43,900లకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఇలా..

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర స్థిరంగా 1,500 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 16.93 డాలర్లకు తగ్గింది.

ఈ వారాంతంలో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ జులై సమావేశ మినిట్స్‌, జాక్సన్‌ హోలీ ప్రసంగం ఉన్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరతో పోలిస్తే డాలర్‌ బలంగా ఉంది అని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ చూడండి: ఎస్​బీఐ తీపికబురు.. రుణాలు మరింత చౌక

Last Updated : Sep 27, 2019, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details