వరుసగా ఐదు రోజులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు ఫ్లాట్గా ముగిశాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.39,670 (సోమవారం నాటి జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరంగా ఉంది. వరుస క్షీణతల నుంచి రూపాయి తేరుకోవడం కారణంగా పసిడి ధరల పెరుగుదలకు అడ్డుకట్టపడిందని నిపుణులు అంటున్నారు.
వెండి ధరలు మాత్రం కిలోకు రూ.190 పెరిగి.. రూ.46,740కి చేరింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వచ్చిన డిమాండే ఇందుకు ప్రధాన కారణం.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఇలా...