తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడి ధరలు మళ్లీ పరుగు.. ప్రస్తుత ధర ఎంతంటే? - వెండి

అంతర్జాతీయంగా ఉన్న భారీ డిమాండుతో బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఇవాళ ఒక్క రోజే రూ.210 పెరిగి.. రూ.39,075కు చేరింది.

బంగారం

By

Published : Oct 4, 2019, 4:32 PM IST

పసిడి ధరలు మరోసారి పరుగందుకున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.210 పెరిగి.. దేశ రాజధాని దిల్లీలో రూ.39,075కు చేరింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండుతో పుత్తడి ధరలు పుంజుకుంటున్నాయని నిపుణులు తెలిపారు. రూపాయి విలువ బలహీన పడటం కూడా పసిడి ధరల పెరగుదలకు మరో కారణంగా పేర్కొన్నారు.

వెండి మాత్రం ఇలా..

బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధర మాత్రం కిలోకు రూ.110 తగ్గి.. రూ.46,490కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,508 డాలర్లకు పెరిగింది. ఔన్సు వెండి ధర 17,58 డాలర్లకు వృద్ధి చెందింది.

ఇదీ చూడండి: పీఎంసీ బ్యాంక్​ అక్రమాల కేసులో ఈడీ సోదాలు

ABOUT THE AUTHOR

...view details