తెలంగాణ

telangana

ETV Bharat / business

గోల్డ్ రష్​: కాస్త దిగొచ్చిన బంగారం ధర

ఇటీవల సరికొత్త రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. బులియన్ మార్కెట్​లో 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 400 తగ్గింది. కిలో వెండి ధర రూ. 125 తగ్గింది.

పసిడి

By

Published : Jul 12, 2019, 6:19 PM IST

బులియన్ మార్కెట్లో నేడు ఒక్కొ రోజే పసిడి ధర 10 గ్రాములకు రూ. 400 తగ్గింది. ఫలితంగా 10 గ్రాముల బంగారం ధర (దిల్లీలో) రూ.35,400లకు చేరింది. దేశీయ వ్యాపారుల నుంచి డిమాండు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది.

బంగారం బాటలోనే వెండి కూడా కిలోకు రూ.125 తగ్గి.. ప్రస్తుతం రూ. 39,075కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర 15.21 డాలర్లు పెరిగింది. పెరిగిన ధరలతో ఔన్సు బంగారం ధర 1,409.40 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి: స్టేట్​ బ్యాంక్​లో డిజిటల్​ లావాదేవీలన్నీ ఫ్రీ

ABOUT THE AUTHOR

...view details