తెలంగాణ

telangana

ETV Bharat / business

నయా ట్రెండ్​: ఆవు పేడ సబ్బు, వెదురు నీటి బాటిల్ - నయా ట్రెండ్

ప్లాస్టిక్​ ఉత్పత్తులపై ఆంక్షల నేపథ్యంలో.. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ పలు సహజ ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఆవుపేడతో తయారు చేసిన సబ్బులు, వెదురు నీటి బాటిళ్లను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వీటిని మార్కెట్లోకి విడుదల చేశారు.

నయా ట్రెండ్​: ఆవు పేడ సబ్బు, వెదురు నీటి బాటిల్

By

Published : Oct 2, 2019, 1:27 PM IST

Updated : Oct 2, 2019, 9:11 PM IST

ఆవు పేడ సబ్బులు, వెదురు కర్రలతో తయారు చేసిన నీటి బాటిళ్లను కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ మార్కెట్లోకి విడుదల చేశారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ) ఈ ఉత్పత్తులను తయారు చేసింది.

125 గ్రాముల అవు పేడ సబ్బు ధర రూ.125. వెదురు నీళ్ల బాటిల్ ధర రూ.560.

గాంధీ జయంతి సందర్భంగా ఒక సారి వాడి పడేసే ప్లాస్టిక్​పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఏర్పడింది. సేంద్రియ వ్యవసాయం, సహజ ఉత్పత్తులతో మున్ముందు మంచి ఫలితాలు వస్తాయని ఎంఎస్​ఎంఈ మంత్రి నితిన్​ గడ్కరీ ఉద్ఘాటించారు.

సహజ ఉత్పత్తులు తయారు చేస్తున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్​ఎంఈ) గడ్కరీ ప్రశంసించారు. ఈ పరిశ్రమల్లో ఆదరణ ఎక్కువగా ఉన్న సంస్థలు స్టాక్ మార్కెట్లో నమోదుకావాలని కోరారు. ఇలా నమోదైన సంస్థల్లో 10 శాతం వాటాను కేంద్రం కొనుగోలు చేసే విధంగా గడ్కరీ ఓ ప్రతిపాదనను ఎంఎస్ఎంఈల ముందు ఉంచారు.

రానున్న రెండేళ్లలో కేవీఐసీ రూ.10,000 కోట్ల ఆదాయం గడిస్తుందని.. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని గడ్కరీ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: బ్యాంకులపై అపోహలు వద్దు.. ఆర్బీఐ హామీ!

Last Updated : Oct 2, 2019, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details