దేశవ్యాప్తంగా 5,600 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయని ప్రభుత్వ రంగ సంస్థ రైల్టెల్ తెలిపింది. 'స్టేషన్' పేరిట నిర్వహిస్తున్న ఉచిత వైఫై కార్యక్రమానికి త్వరలో ముగింపు పలకనున్నట్లు గూగుల్ వెల్లడించిన నేపథ్యంలో 'రైల్టెల్' తాజా ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు నుంచి గూగుల్ తప్పుకున్నప్పటికీ.. వైఫై స్పీడులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా 400కు పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ఇచ్చే ఉద్దేశంతో భారత రైల్వే సహా రైల్టెల్ భాగస్వామ్యంతో 'స్టేషన్' పేరిట 2015లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది గూగుల్. వీటి మధ్య ఒప్పందం ఈ ఏడాది మధ్యలో ముగియనుంది.