గిగా ఫైబర్‌తో అంతర్జాల సేవల్లో సంచలనం సృష్టించబోతున్న జియో.. ల్యాండ్‌లైన్ ద్వారా కాలింగ్లోనూ బంపర్ ఆఫర్ ఇస్తోంది. జియో ఫిక్స్డ్ ల్యాడ్‌లైన్ ద్వారా ఉచిత కాల్స్ సదుపాయం కల్పించనుంది. గిగాఫైబర్ ప్యాక్‌తో కలిపే ల్యాండ్‌లైన్ సౌకర్యం కల్పిస్తోంది జియో.
జియో మాతృసంస్థ రిలయన్స్ సర్వసభ్య వార్షిక సమావేశానికి కేవలం కొన్ని రోజుల ముందే ల్యాండ్‌లైన్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. గిగా ఫైబర్ బీటా యూజర్లు ఇప్పటికే ల్యాండ్‌లైన్ ద్వారా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతున్నారు.
ల్యాండ్‌లైన్‌లో అద్భుత ఫీచర్..
ల్యాండ్‌లైన్ నెంబర్‌ను స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేసి.. స్మార్ట్ ఫోన్ నుంచి ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించనుంది జియో. ఇందుకోసం యూజర్లు జియో కాలింగ్ యాప్ ద్వారా ల్యాండ్‌లైన్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
యాక్టివేట్ చేసుకోండిలా..
ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా, ఐ ఫోన్ యాప్ స్టోర్ ద్వారా జియో కాలింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలి.
జియో 4జీ సిమ్, జియోఫై కనెక్షన్, ఫిక్స్డ్ ల్యాండ్‌లైన్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ స్మార్ట్ ఫోన్లో వీఓఎల్టీఈ సదుపాయం లేకపోతే మొదటి ఆప్షన్ ఎంచుకోవాలి. జియో ఫై ద్వారా కాల్స్ వెళ్లాలి అనుకుంటే రెండో ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు జియో ఫిక్స్డ్ వాయిస్ కనెక్షన్ ఉంటే మూడో ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ దశ పూర్తయిన తర్వాత మీరు నమోదు చేసుకున్న నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సమర్పిస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. చివరి దశ పూర్తయిన తర్వాత స్మార్ట్ ఫోన్ల నుంచి ఉచిత కాలింగ్‌కు సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గరిష్ఠంగా ఆరు ఫోన్లను... జియో ల్యాండ్‌లైన్ నెంబర్‌కు అనుసంధానం చేసుకోవచ్చు.
ఉచితంగా కాల్స్ చేయాలాన్నా, కాల్స్ పొందాలన్నా జియో రూటర్‌తో అనుసంధానమై ఉండాలి.
వచ్చే నెల 5 నుంచి గిగా ఫైబర్ వాణిజ్య సేవలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు జియో బ్రాడ్‌బాండ్ ప్లాన్లు, ల్యాండ్లైన్లకు సంబంధించి ఆఫర్ల పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఇదీ చూడండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ