తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్​కు భారీ జరిమానా విధించిన ఫ్రాన్స్​!

ఐరోపాలో గూగుల్​కు మరోసారి భారీ జరిమానా పడింది. గూగుల్​ యాడ్స్​ నిబంధనలపై పలు ఆరోపణలతో 166 మిలియన్​ డాలర్ల అపరాధ రుసుము విధించింది ఫ్రాన్స్​ కాంపిటీషన్​ అథారిటీ.

GOOGLE
గూగుల్​

By

Published : Dec 21, 2019, 4:52 PM IST

సెర్చ్​ ఇంజిన్​ దిగ్గజం గూగుల్​కు ఫ్రాన్స్​ కాంపిటీషన్​ అథారిటీ భారీ జరిమానా వేసింది. ఆన్​లైన్​ ప్రకటన విపణిలో అధికార దుర్వినియోగం చేసిన ఆరోపణలతో 150 మిలియన్​ యూరోల (166 మిలియన్​ డాలర్లు) అపరాధ రుసుము విధించింది.

"గూగుల్ యాడ్స్​ను అర్థం చేసుకోవడం చాల క్లిష్టతరం" అని.. కంపెనీ పేర్కొంది.​ యాడ్స్​ విషయంలో అసమానంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫ్రాన్స్ కాంపిటీషన్​ అథారిటీ ఆరోపించింది.

యాడ్స్​ను ఎలా ఉపయోగిస్తోంది? ఖాతాలను నిలిపివేసేందుకు ఎలాంటి విధానాలు పాటిస్తోందో తెలపాలని గూగుల్​ను ఆదేశించింది.
తాజా జరిమానాతో గూగుల్​ ఐరోపాలో ఇటీవల పలు జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.

దీనిపై స్పందించిన గూగుల్​.. తాజా జరిమానాపై అప్పీల్​కు వెళ్తామని పేర్కొంది. గూగుల్ యాడ్​ నిబంధనలు వినియోగదారులను దోపిడి, అసభ్య ప్రకటనల నుంచి రక్షించేందుకు రూపొందించినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'ఆల్ఫాబెట్​​ సీఈఓ'గా సుందర్​​ పిచాయ్​ పారితోషికం తెలుసా?

ABOUT THE AUTHOR

...view details