తెలంగాణ

telangana

ETV Bharat / business

2020-21 బడ్జెట్ కసరత్తు ఈనెల 14 నుంచే!

మోదీ 2.0 ప్రభుత్వం రెండో వార్షిక బడ్జెట్​పై ఆక్టోబర్​ 14 నుంచి కసరత్తు ప్రారంభించనుంది. నవంబర్ మొదటి వారం వరకు ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు సమావేశం కానున్నారు.

2020-21 బడ్జెట్ కసరత్తు ఈనెల 14 నుంచే!

By

Published : Oct 6, 2019, 1:50 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ కసరత్తుకు సిద్ధమైంది ఆర్థికమంత్రిత్వ శాఖ. ఈ నెల 14 నుంచి 2020-21 బడ్జెట్​ అంచనాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక మందగమనం, ప్రభుత్వ ఆదాయం తగ్గుదల వంటి అంశాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. మోదీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు ఇది రెండో బడ్జెట్ కానుంది.

"ముందస్తు బడ్జెట్​/సవరించిన అంచనాలతో అక్టోబర్​ 14 నుంచి సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర బడ్జెట్​ సమాచార వ్యవస్థలో పొందుపరిచిన మార్గదర్శకాలకు అనుగుణంగా... ఆర్థిక సలహాదారులు సవరించిన బడ్జెట్​ అంచనా వివరాలు పొందుపరచాలి."
-ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ విభాగ ప్రకటన

2020-21 వార్షిక బడ్జెట్​ను ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయానికి మోదీ ప్రభుత్వం 2017లో స్వస్తి చెప్పింది.

ఇదీ చూడండి: అత్యధిక స్థాయికి విదేశీ మారక నిల్వలు..!

ABOUT THE AUTHOR

...view details