తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఉద్యోగం బాగుంది కానీ.. వేతనాలే ప్చ్..!' - బిజినెస్ వార్తలు తెలుగు

ఉద్యోగులపై ప్రపంచవ్యాప్తంగా ఓ  ఆసక్తికర సర్వే జరిగింది. ఇందులో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ ఉద్యోగం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారని పేర్కొంది. అయితే అంతకన్నా ఎక్కువ శాతం మంది ఉద్యోగులు తమ వేతనాల పట్ల మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

ఉద్యోగం బాగుంది కానీ.. వేతనాలే ప్చ్..

By

Published : Nov 15, 2019, 9:01 AM IST

ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం మంది తమ ఉద్యోగాలతో సంతృప్తిగా ఉన్నట్లు ఓ సర్వే నివేదిక తేల్చింది. అయితే వేతనాలపై చాలా మంది సంతృప్తికరంగా లేరని మోన్​స్టర్​ వేతనాల సూచీ నివేదిక పేర్కొంది.

వేతనాల విషయంలో 21.6 శాతం మంది ఉద్యోగులు మాత్రమే సంతృప్తికరంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

వేజ్​ఇండికేటర్ అనే సంస్థ 2016 జనవరి నుంచి 2018 డిసెంబర్​ వరకు.. మూడేళ్ల పాటు ఉద్యోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. వేతనాలను పేచెక్​.ఇన్ వేతన గణన,మోన్​స్టర్​ వేతనాల సూచీ ఆధారంగా వేతనాలను విశ్లేషించారు.

సర్వేలోని మరికొన్ని అంశాలు..

సర్వేలో పాల్గొన్న వారు తమ సహోద్యోగులతో 92 శాతం, పైఅధికారులతో 87 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించిందీ నివేదిక.

ముఖ్యంగా నిర్మాణ, సాంకేతిక కన్సల్టెన్సీ, హెల్త్​కేర్​ సేవలు, సామాజిక, కమ్యూనికేషన్​ టెక్నాలజీ సేవలు, న్యాయ, మార్కెట్ కన్సల్టెన్సీ, వ్యాపార వ్యవహారాల రంగాల్లోని ఉద్యోగులు.. తమ ఉద్యోగం పట్ల అధికంగా సంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.

తమ ఉద్యోగం పట్ల సంతృప్తిగా ఉన్న ఉద్యోగుల జాబితాలో 84 శాతం మందితో న్యాయ, మార్కెట్​ కన్సల్టెన్సీ తొలి స్థానంలో ఉంది. 83 శాతం మంది సంతృప్తికర ఉద్యోగులతో టెక్నాలజీ కన్సల్టెన్సీ రంగం రెండో స్థానంలో నిలిచింది.

విద్యా, పరిశోధన రంగాల్లోని సంతృప్తికర ఉద్యోగులు 2018లో 53 శాతానికి తగ్గారని నివేదిక వెల్లడించింది. 2017లో వీరు 73 శాతంగా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి: భారత జీడీపీ వృద్ధి రేటు మరోసారి తగ్గించిన మూడీస్​

ABOUT THE AUTHOR

...view details