కరోనా విజృంభణ నేపథ్యంలో ఆసియాలోని వైరస్ ప్రభావిత దేశాలకు తమ ఇంజినీర్లు వెళ్లకుండా యాపిల్ ఆంక్షలు విధించింది. ఏప్రిల్ మాసాంతం వరకు వెళ్లద్దని సూచించింది. ఫలితంగా చైనాలో తయారవతున్న ఐఫోన్ 5జీ ఫోన్లను పరీక్షించటంలో ఆలస్యం జరగుతున్నట్లు తెలుస్తోంది.
తగ్గిన ఉత్పత్తి..
చైనాలోని హీనన్ రాష్ట్రంలోని జెంగ్ఝూలో యాపిల్ ప్రధాన తయారీ కేంద్రం ఉంది. ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ ఆధ్వర్యంలో ఐఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. కరోనా వ్యాప్తితో నిలిచిపోయిన ఉత్పత్తిని నెమ్మదిగా ప్రారంభిస్తోంది ఫాక్స్కాన్. ఇక్కడ మొత్తం 80 వేల మంది ఉద్యోగుల్లో 1,800 మంది పనిచేస్తున్నారు. అది కూడా స్థానిక అధికారుల సాయంతో జరుగుతోంది.