తెలంగాణ

telangana

By

Published : Feb 14, 2020, 6:20 PM IST

Updated : Mar 1, 2020, 8:37 AM IST

ETV Bharat / business

టెల్కోలకు షాక్​- రూ.1.47లక్షల కోట్లు చెల్లించాల్సింది నేడే!

ఏజీఆర్ బాకాయిల విషయంలో టెల్కోలకు టెలికాం శాఖ పెద్ద షాకిచ్చింది. ఇవాళ రాత్రి 12 గంటలలోపు బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. బకాయిల విషయంలో సుప్రీం ఆగ్రహించిన నేపథ్యంలో టెలికాం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

BIZ-TELECOM-ORDER
టెల్కోలకు షాక్

సుప్రీంకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో టెల్కోలకు షాకిచ్చింది టెలికాం శాఖ. ఏజీఆర్​ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లను ఈ రోజే చెల్లించాలని ఆదేశించింది. ఇవాళ రాత్రి 11.59 గంటలలోపు చెల్లించాలని స్పష్టంచేసింది.

బకాయిల విషయంలో తమ తీర్పుపై టెలికాం శాఖ డెస్క్ అధికారి స్టే విధించటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు బకాయిలు చెల్లించని కారణంగా.. ఈ విషయం కోర్టు ధిక్కరణ కిందికి ఎందుకు రాదని ప్రశ్నించింది.

సుప్రీం ఆగ్రహంతో టెలికాం శాఖ తక్షణమే దిద్దుబాటు చర్యలకు దిగింది. బకాయిలు చెల్లించకపోతే టెల్కోలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇచ్చిన ఉత్తర్వులను ఈ రోజు ఉదయం ఉపసంహరించుకుంది.

ఇదీ చూడండి:సుప్రీం తలంటు - డీఓటీ ఉత్తర్వు ఉపసంహరణ

Last Updated : Mar 1, 2020, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details