తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రత్యేక ఆహారం అడగొద్దు : ఎయిర్​ ఇండియా - కోరరాదు

విధుల్లో ఉన్నప్పుడు ప్రత్యేక ఆహారం అడగొద్దని పైలట్లను ఆదేశించింది ఎయిర్​ ఇండియా. అయితే అనారోగ్య సమయాల్లో మాత్రం ఇందుకు మినహాయింపునిచ్చింది.

ఎయిర్ ఇండియా

By

Published : Mar 27, 2019, 11:29 PM IST

విధుల్లో ఉన్నప్పుడు ప్రత్యేక ఆహారాన్ని ఆర్డర్​ చేయవద్దని ఎయిర్ ఇండియా తమ పైలట్లను ఆదేశించింది. సంస్థ తయారు చేసిన జాబితాను అనుసరించి మాత్రమే ఆహారం తీసుకోవాలని సూచించింది. సంస్థ అంతర్గత చర్చల్లో భాగంగా ఈ ప్రకటన చేసింది ఎయిర్​ ఇండియా.

విమాన సిబ్బంది తమకోసం ప్రత్యేక భోజనాన్ని కోరడం నిబంధనలకు వ్యతిరేకమని పైలట్లకు పంపిన ఈ-మెయిల్​లో ఎయిర్​ ఇండియా వ్యవహారాల డైరెక్టర్​ అమితాబ్ సింగ్​ పేర్కొన్నారు. అయితే ఎవరైనా సిబ్బందికి ఆరోగ్య సమస్యలుండి వైద్యుల సూచన మేరకు అవసరమైన ఆహారాన్ని తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపారు అమితాబ్​ సింగ్​.

చాలా మంది పైలట్లు ప్రత్యేక భోజనాన్ని కోరుతున్నారని, దీంతో విమానాల్లో ఆహార నిర్వాహణ వ్యయం పెరిగిపోతోందనిసంస్థ అధికారి ఒకరు వెల్లడించారు.భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:'నా అవసరం ఉందంటే తప్పక కలిసి పనిచేస్తా'

ABOUT THE AUTHOR

...view details