తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్​ వెబ్​లో ఈ ట్రిక్​లు తెలుసా? - బిజినెస్ వార్తలు

వాట్సాప్​ మొబైల్​ యాప్​తో పాటే.. వాట్సాప్​ వెబ్​లో సరికొత్త ఫీచర్లు వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నాయి. అయితే చాలా మందికి వాట్సాప్​ వెబ్​లో ఉన్న కొన్ని ఉపయోగకరమైన ట్రిక్స్ గురించి తెలియదు. ఇంతకి ఆ ట్రిక్స్ ఏంటి? వాటిని ఎలా వాడాలి? అనే విషయాలు మీ కోసం.

వాట్సాప్​ వెబ్​

By

Published : Nov 23, 2019, 11:06 AM IST

ఫేస్​బుక్​కు చెందిన ప్రముఖ సంక్షిప్త సందేశాల సంస్థ వాట్సాప్​.. అనేకమంది జీవితాల్లో ఓ భాగమైంది. దీనికి తగ్గట్టుగానే వినియోగదారులను ఆకర్షించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తెస్తోంది. ఇటీవలి కాలంలో వెనువెంటనే కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. మరికొన్ని అప్​డేట్​లు త్వరలో రానున్నాయి. ఇవన్ని మొబైల్​ యాప్​లలో ఉన్నాయి. అయితే మొబైల్ ఫోన్లలోనే కాకుండా.. మీ పనిలో భాగంగా వాట్సాప్​ను వినియోగిస్తే.. మీకు వాట్సాప్ వెబ్​ గురించి తెలిసే ఉంటుంది. మీరు వాడే కంప్యూటర్​లో సులభంగా వాట్సాప్​ను వినియోగించేందుకు తీసుకువచ్చిన సదుపాయమే ఈ వాట్సాప్ వెబ్​. ఫోన్​తో పని లేకుండా కంప్యూటర్ ద్వారానే వాట్సాప్​లో అన్ని రకాల పనులు చేయొచ్చు. అయితే వాట్సాప్ వెబ్​లో ఎన్నో ఫీచర్లు దాగి ఉన్నాయి. అవెంటి.. వాటిని ఎలా వినియోగించుకోవాలి అనే వివరాలు మీకోసం.

ఈమోజీలు వేగంగా..

ప్రస్తుతం.. ప్రతి సందేశానికి ఈమోజీతో రిప్లై ఇవ్వడం తప్పని సరిగా మారింది అనేది అందరు అంగీకరించే విషయమే. ప్రతి విషయాన్ని మరింత బలంగా చెప్పేందుకు ఈ ఈమోజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మొబైల్​ ఫోన్లలో వీటిని పంపడం సులభంగానే ఉన్నా.. వాట్సాప్ వెబ్​లో వాటిని మౌస్​తో ఎంచుకుని పంపాల్సి వస్తుంది. ఇది కాస్త.. ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. మీకు కావాల్సిన ఈమోజి కోసం ":" (కోలన్)ను టైప్​ చేయాలి. ఆ తర్వాత మీకు అవసరమైన ఈమోజి పదాన్ని టైప్ చేస్తే.. ఆ ఈమోజీలు మాత్రమే కనిపిస్తాయి. వాటిని సలభంగా ఎంపిక చేసుకుని పంపించొచ్చు.

మల్టిపుల్ వాట్సాప్​లు..

మొబైల్​ ఫోన్లలో ఒకే సారి ఒకే నంబర్​పై రెండు వాట్సాప్​లు కుదరదు. అయితే వాట్సాప్​ వెబ్​లో అది పెద్ద సమస్యకాదు. వెబ్​లో ఒకేసారి రెండు కన్నా ఎక్కువ వాట్సాప్​లు వినియోగించుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఒక కంప్యూటర్​లో మల్టిపుల్ వాట్సాప్​లు వాడాలంటే.. ఇన్​కాగ్నిటో ట్యాబ్​, వేరే బ్రౌజర్లలో వాట్సాప్ వెబ్​ను వినియోగించి వాడుకోవచ్చు.

అవతలి వారికి తెలియకుండా మెసేజ్​లు చదవచ్చు..

మీరు ఏ మెసేజ్ చదివినా అవతలి వారికి సులభంగా తెలిసిపోతుంది. అలా తెలియకుండా ఉండాలంటే వాట్సాప్​ వెబ్​లో ఓ ట్రిక్​ ఉంది. ఇందుకోసం ముందుగా మీ వాట్సాప్​ వెబ్​ ఉన్న విండోను ఓపేన్​ చేసి.. అది కనబడేలా మరో విండోను ఓపేన్ చేయాలి. తర్వాత ఓపెన్​ చేసిన విండోపైన మాత్రమే కర్సర్​ను ఉంచాలి దీని ద్వారా అవతలి వ్యక్తికి.. మీరు మెసేజ్ చదివినట్లు తెలియదు.

ఇదీ చూడండి:మార్కెట్లోకి 'వివో యూ20'.. ధర, కీలక ఫీచర్లు ఇవే

ABOUT THE AUTHOR

...view details