తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​ వీడాలంటే రూ.18వేల కోట్లు కట్టాల్సిందే! - జెట్ ఎయిర్​వేస్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని జెట్ ఎయిర్​వేస్​ మాజీ అధినేత నరేశ్​ గోయెల్​కు దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లుక్ అవుట్ నోటీసులను సవాలు చేస్తూ గోయెల్ వేసిన వ్యాజ్యంపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.

నరేశ్​ గోయెల్​

By

Published : Jul 9, 2019, 2:06 PM IST

జెట్​ ఎయిర్​వేస్ వ్యవస్థాపకుడు, మాజీ అధినేత నరేశ్ గోయెల్​కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. ఒక వేళ విదేశాలకు వెళ్లాలనుకుంటే రూ.18,000 కోట్ల పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది.

తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసులను సవాలు చేస్తూ గోయెల్​ వేసిన వ్యాజ్యంపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.

లుక్ అవుట్ నోటీసులు ఎప్పుడంటే?

జెట్​ ఎయిర్​వేస్​ సంస్థ రూ.8వేల కోట్లకుపైగా రుణభారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. విధిలేని పరిస్థితుల్లో కొంతకాలం క్రితం మూతపడింది. అయితే... ఈ మొత్తం వ్యవహారంలో రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థ-ఎస్​ఎఫ్​ఐఓ విచారణ జరుపుతోంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయెల్‌, ఆయన భార్య అనిత మే 25న దుబాయ్ మీదగా లండన్​ వెళ్లేందుకు ముంబయిలో విమానం ఎక్కారు. మరికొద్ది సేపట్లో విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. అధికారులు వారిని కిందకు దింపారు. వారిద్దరిపై లుక్​ అవుట్​ నోటీసులు జారీ అయినట్లు తెలిపారు.

ఎలాంటి కేసు నమోదు చేయకుండా లుక్​ అవుట్ నోటీసులు జారీ చేయడాన్ని గోయెల్ తప్పుబడుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన వాదనల్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'బడ్జెట్ ప్రతిపాదనలతో స్థిరాస్తి రంగానికి ఊతం'

ABOUT THE AUTHOR

...view details