తెలంగాణ

telangana

ETV Bharat / business

నానో, సుమో, జైలో... ఇక కొత్తవి కొనలేం! - జైలో

భారత్​లో 2020 ఏప్రిల్ నుంచి భారత్​ స్టేజ్ (బీఎస్​)-6 ఉద్గార నియమాలను అమలు చేయనుంది ప్రభుత్వం. కొన్ని ఆటోమోబైల్​ కంపెనీలు వాటి పాత మోడళ్లను బీఎస్​-6కు మార్చడం కన్నా తయారీనే నిలిపేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. అందులో ప్రజాదరణ ఉన్న వాహనాలేంటో తెలుసా?

కార్లు

By

Published : May 18, 2019, 3:36 PM IST

Updated : May 21, 2019, 12:21 PM IST

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్​ స్టేజ్ (బీఎస్​)-6 ఉద్గార నియమాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పలు ఆటో మోబైల్​ కంపెనీలు కొత్త మోడళ్లు సహా ఇప్పటికే ఉన్న వాహనాలను బీఎస్​-6 నియమాలకు అనుగుణంగా మార్చనున్నాయి. కొన్ని మోడళ్లను మాత్రం అప్​గ్రేడ్​ చేయడం కన్నా వాటి తయారీనే నిలిపివేసేందుకు ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఆ మోడళ్లు ఏవి? ఎందుకు?

4 మోడళ్లకు "టాటా"

ఉద్గార నియమాల ప్రభావంతో దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్​ ఏకంగా 4 మోడళ్లకు గుడ్​బై చెప్పనుంది.

నానో

నానో

సామాన్యులు సైతం కారు కొనాలనే కలను సాకారం చేసేందుకు తక్కువ ధరతో వచ్చిన కారు టాటా నానో. రూ.లక్ష కే కారు అందించాలనేది రతన్​ టాటా ఆలోచన. ఇందుకోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది టాటా.

బీస్​-6 ఉద్గార నియమాలతో వీటిని తీసుకురావడంకన్నా నానో తయారీని నిలిపివేసేందుకే టాటా మోటార్స్ ఆసక్తి చూపుతోంది. ప్రారంభంలో భారీగా అమ్ముడైన ఈ కార్లకు గత కొన్ని నెలలగా ఆదరణ తగ్గడం మరో కారణం.

బోల్ట్ ​& జిస్ట్​

బోల్ట్​

కాంపాక్ట్​ సెడాన్​ విభాగంలో ఇతర కంపెనీల నుంచి వస్తున్న గట్టి పోటీని టాటా బోల్ట్​, జిస్ట్​ మోడళ్లు ఎదుర్కోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడళ్లను బీఎస్​-6కు అప్​గ్రేడ్​ చేయడం కన్నా తయారీని నిలిపివేసేందుకే టాటా మోగ్గు చూపుతోంది.

టాటా సఫారీ

టాటా సఫారీ

టాటా సఫారీ పేరు వినగానే చాలా మందికి ఆ మోడల్​ కార్ల పనితీరు, ఆకృతి గుర్తుకు వస్తాయి. అంతలా ఆదరణ పొందింది సఫారీ.

2005లో వచ్చిన ఈ మోడల్​కు 2012 వరకు అప్​గ్రేడ్​లు తీసుకువచ్చింది టాటా. అప్పటి నుంచి అవే ఫీచర్లతో రాణిస్తోంది. ఇప్పటికే ఇలాంటి వాహనాలను ఇతర కంపెనీలు సరికొత్తగా అందిస్తున్నందున... నూతన ఉద్గార నియమాల అమలుకు ముందే వీటి తయారీని నిలిపేయాలని టాటా మోటార్స్​ భావిస్తోంది.

సఫారీ స్థానాన్ని టాటా హెక్సా, టాటా హారియర్, త్వరలో రానున్న బజార్డ్ వాహనాలతో భర్తీ చేయనుంది టాటా.

టాటా సుమో

టాటా సుమో

టాటా మోటార్స్ నుంచి చాలా ఏళ్లుగా వస్తున్న వాహనం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా సుమో అనే చెప్పాలి. పేరు మొదలుకుని మార్కెట్లో ఇది చేసిన సందడి అంతా ఇంతా కాదు.

టాటా మోటార్స్​ మాజీ మేనేజింగ్ డెరెక్టర్​ సుమంత్ ముల్గావ్​కర్​ పేరుమీద అప్పట్లో తీసుకువచ్చిన కొత్త మోడల్​కు 'సుమో' అని నామకరణం చేశారు. మార్కెట్లోకి వచ్చిన వెంటనే 'మిట్సుబిషి' పజారియో, 'టొయోటా' ప్రేడో మోడళ్లకు గట్టి సవాల్ విసిరింది.

ప్రారంభంలో నెలకు 500 యూనిట్లు అమ్ముడయ్యేవి. అయితే 2019 మార్చిలో కేవలం 19 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆదరణ తగ్గడం సహా కొత్త మోడళ్ల పోటీని ఎదుర్కోలేకపోతోంది సుమో. ఈ కారణంగా ఇప్పటికే వీటి తయారీని నిలిపేసింది టాటా మోటార్స్​.

ఓమ్నీకి ఇక సెలవు

'ఓమ్నీ'

'ఓమ్నీ' అంటే సినిమాల్లో ఎక్కువగా వాడే వాహనంగా అందరికీ సుపరిచితం. ప్రజాదరణ బాగానే ఉంది.

1984లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ వాహనం నూతన ఉద్గార నియమాలను అందిపుచ్చుకోవడం కష్టమని మారుతీ సుజుకీ పేర్కొంది. ఈ మేరకు ఓమ్నీ వాహనాల తయారీని నిలిపేయనుంది. 'ఓమ్నీ' లోటును 'ఈకో' వాహనంతో భర్తీ చేయాలని మారుతీ భావిస్తోంది.

మహీంద్రా జైలో

మహీంద్రా జైలో

మహీంద్రా అండ్​ మహీంద్రా... జైలో వాహన తయారీని 2020 నుంచి నిలిపివేసే అవకాశం ఉంది. ఉద్గార నియమాల ప్రభావమే కాకుండా.. కంపెనీ తెస్తున్న నూతన మోడళ్లు మారజో ఎంపీవీ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది.

జైలో స్థానంలో మారజో మోడల్​ను ప్రమోట్​ చేయడమే నయమని మహీంద్రా భావిస్తోంది.

Last Updated : May 21, 2019, 12:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details