రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపారంలోకి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్ గ్రూప్ 1.5-2 బిలియన్ డాలర్ల మేర రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు చెప్పారు.
ఈ ఒప్పందం ఖరారైతే భారత రిటైల్ రంగంలో కార్లైల్ గ్రూప్ మొదటి పెట్టుబడి ఇదే కానుంది. దీనితో పాటు రిటైల్ వ్యాపారాల్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద పెట్టుబడి కానుంది.
భారత్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ వ్యాపారాల్లో కార్లైల్ గ్రూప్ పెట్టుబడికి పెట్టేందుకు ప్రణాళిలకు వేస్తోందని.. ఇందులో భాగంగానే రిలయన్స్‌లో వాటా కొనుగోలును అంశాన్ని పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ రిటైల్ వ్యాపారాల్లో రూ.7.5వేల కోట్ల పెట్టుబడితో 1.75 శాతం వాటాను దక్కించుకుంది.