టాటా మోటర్స్ ఎండీ, సీఈఓ గుంటెక్ బుషెక్ జూన్ 30న తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే సంస్థకు కన్సల్టంట్గా ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఆయన కొనసాగుతారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా గిరీశ్ వాగ్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
'వ్యక్తిగత కారణాల వల్ల జర్మనీకి వెళ్లాలని అనుకుంటున్నందున, కాంటాక్ట్ ముగిసిన అనంతరం బాధ్యతల నుంచి తప్పుకుంటానని బుషెక్ సమాచారం ఇచ్చారు. జూన్ 30, 2021 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయన ఎండీ, సీఈఓ పదవుల నుంచి వైదొలుగుతారు' అని టాటా మోటర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.