తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోతో పోటీకి బీఎస్​ఎన్ఎ​ల్ రె'ఢీ'

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్​ఎల్..​ రిలయన్స్​ జియోతో పోటీ పడేందుకు సరి కొత్త ఆఫర్లను ప్రకటించింది. జియో జిగా ఫైబర్​ను ప్రారంభించడానికి సిద్ధమైన తరుణంలో ముందుగానే కొత్త వినియోగదార్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బీఎస్​ఎన్​ఎల్. కొత్త ఆఫర్లతో సహా ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్​స్రిప్షన్​ను ఉచితంగా ఇస్తూ​ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

By

Published : Jul 7, 2019, 5:26 PM IST

Updated : Jul 8, 2019, 5:32 PM IST

జియోతో పోటీకి బీఎస్​ఎన్ఎ​ల్ రె'ఢీ'

ప్రైవేటు టెలికం రంగ సంస్థలతో బీఎస్​ఎన్​ఎల్​ (భారత్​ సంచార్​ నిగమ్​ లిమిటెడ్) పోటీ పడుతూ ఆఫర్లు ప్రకటిస్తోంది. ముఖ్యంగా రిలయన్స్​ జియో జోరును ఆపేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. జియో జిగా ఫైబర్​ను తీసుకొచ్చే ముందే బీఎస్​ఎన్​ఎల్ నెట్​ వేగాన్ని పెంచుతూ సరి కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆఫర్లతో పాటు వీడియో స్ట్రీమింగ్​ ప్లాట్​ఫాంలైన అమెజాన్​ ప్రైమ్, హాట్​స్టార్​ సర్వీసులను ఉచితంగా అందిస్తోంది.

జులై 1 నుంచి కొత్త ఆఫర్లతో దూసుకుపోతోంది బీఎస్​ఎన్​ఎల్. మొత్తం 7 ప్లాన్​లను తీసుకొచ్చింది బీఎస్​ఎన్​ఎల్.

రీఛార్జ్​ వివరాలు...

  1. నెలకు రూ.349 రీఛార్జ్​ చేస్తే రోజుకు 8 ఎమ్​బీపీఎస్​ వేగంతో 2జీబీ డేటా, అన్ని నెట్​వర్క్​లకు అపరిమిత కాలింగ్​.
  2. నెలకు రూ.599 రీఛార్జ్​ చేస్తే రోజుకు 10 ఎమ్​బీపీఎస్​ వేగంతో 4జీబీ డేటా, అన్ని నెట్​వర్క్​లకు అపరిమిత కాలింగ్​.
  3. నెలకు రూ.699 రీఛార్జ్​ చేస్తే రోజుకు 10 ఎమ్​బీపీఎస్​ వేగంతో 5జీబీ డేటా, అన్ని నెట్​వర్క్​లకు అపరిమిత కాలింగ్​.
  4. నెలకు రూ.749 భారత్​ ఫైబర్​ ప్లాన్​కు రీఛార్జ్​ చేస్తే రోజుకు 50 ఎమ్​బీపీఎస్​ వేగంతో 300జీబీ డేటా, అన్ని నెట్​వర్క్​లకు అపరిమిత కాలింగ్​. వీటితో పాటు అదనంగా హాట్​స్టార్ సర్వీసును ఏడాది పాటు ఉచితంగా ఇస్తుంది.
  5. నెలకు రూ.849 ఫైబర్​ ప్లాన్​కు రీఛార్జ్​ చేస్తే రోజుకు 50 ఎమ్​బీపీఎస్​ వేగంతో 600 జీబీ డేటా, అన్ని నెట్​వర్క్​లకు అపరిమిత కాలింగ్​. వీటితో పాటు అదనంగా అమెజాన్​ ప్రైమ్​ సర్వీసును ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
  6. చివరిగా రూ.899, రూ. 999 బ్రాండ్​బాండ్​ ప్లాన్​ వేసుకుంటే రోజుకు 12జీబీ, 15జీబీ డేటాను పొందవచ్చు. అన్ని నెట్​వర్క్​లకు అపరిమిత కాలింగ్​. అలానే అమెజాన్​ ప్రైమ్​ సర్వీసును ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు.

వీటితో పాటు మరి కొన్ని పెద్ద ఆఫర్లను బీఎస్​ఎన్​ఎల్​ అందిస్తుంది.

Last Updated : Jul 8, 2019, 5:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details