కరోనాపై పోరుకు ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదాని ముందుకొచ్చారు. తమ సంస్థ నుంచి పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.100 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలోని ఉద్యోగులంతా కలిసి మరో రూ.4 కోట్లను అందజేశారు. ఈ మేరకు కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి అదాని గ్రూప్ తమ వంతు స్వేదాన్ని చిందిస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చర్యలతో లాక్డౌన్ విధించినప్పటికీ.. మహమ్మారి ఎంతో మంది ప్రాణాల్ని బలిగొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు అదాని.
కొన్ని దశాబ్దాల తర్వాత మన పిల్లలు వెనక్కి తిరిగి చూస్తే.. ఈ దేశ పౌరులుగా ఉన్నందుకు వారు గర్వించాలి. భారతీయులంతా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వంతో ఐక్యంగా నిలబడ్డారని తెలుసుకోవాలి.