ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

రేపటి నుంచి 250 జిల్లాల్లో బ్యాంకుల లోన్​ మేళా..! - జిల్లాల్లో లోన్​మేలా

దేశంలోని ప్రముఖ బ్యాంకులు రేపటి నుంచి లోన్​ మేళా ప్రారంభించనున్నాయి. ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహమందించడం సహా.. నగదు లభ్యత పెంచేందుకు దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో లోన్​మేళా నిర్వహించనున్నాయి బ్యాంకులు.

రేపటి నుంచి 250 జిల్లాల్లో బ్యాంకుల లోన్​ మేళా..!
author img

By

Published : Oct 2, 2019, 8:01 PM IST

Updated : Oct 2, 2019, 10:21 PM IST

ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో వ్యవస్థలోకి మరింత నగదు చలామణీలోకి తీసుకువచ్చేందుకు దేశంలోని ప్రముఖ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్ధకు ఊతమివ్వడం సహా పండుగ సీజన్‌లో డిమాండ్‌ను తీర్చేందుకు దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో బ్యాంకులు గురువారం నుంచి రుణ మేళాలు నిర్వహించనున్నాయి. తమ ఖాతాదారులు, చిల్లర వర్తకులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు బ్యాంకులు రుణాలు అందజేయనున్నాయి.

వ్యవసాయ, వాహన, గృహ, విద్య, వ్యక్తిగత రుణాలను ఈ రుణ మేళాలలో అప్పటికప్పుడు మంజూరు చేస్తాయి. సేవలను ఖాతాదారుల ఇంటివద్దకే తీసుకువెళ్లేందుకు అనుసరిస్తున్న క్రమబద్ధ సంస్కరణల్లో భాగంగా బ్యాంకులు ఈ మేళాలను నిర్వహిస్తున్నాయి. ఇటీవల వార్షిక పనితీరు సమీక్షా సమావేశం సందర్భంగా వీటిని నిర్వహించాలని బ్యాంకులు నిర్ణయించాయి.

గత నెలలో ఆర్థిక ఉద్దీపన ప్రకటనలు చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రుణమేళాల గురించి ప్రస్తావించడం గమనార్హం.

ఇదీ చూడండి: మేజిక్​ మెసేజ్​... వాట్సాప్​లో మరో అద్భుత ఫీచర్

Last Updated : Oct 2, 2019, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details