తెలంగాణ

telangana

ETV Bharat / business

'మార్చి నాటికి బ్యాంకింగ్​ రంగం మెరుగుపడుతుంది'

బ్యాంకింగ్​ వ్యవస్థ వచ్చే ఏడాది మార్చి నాటికి మెరుగవుతుందని ఎస్​బీఐ ఛైర్మన్ రజ్​నీశ్​ కుమార్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీక్కి 92వ వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.

SBI
రజనీశ్​ కుమార్​

By

Published : Dec 21, 2019, 6:07 PM IST

చాలా వరకు బ్యాంకులు మార్చి నాటికి.. ఎన్​పీఏలు తగ్గి మంచి స్థాయిలో ఉంటాయని భారతీయ స్టేట్​ బ్యాంక్​ (ఎస్​బీఐ) ఛైర్మన్ రజ్​నీశ్​ కుమార్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుణాల వ్యవస్థలో ద్రవ్య కొరత లేదని ఆయన తెలిపారు.

ఫిక్కీ 92 వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

ఫిక్కీ వార్షిక సదస్సులో మాట్లాడుతున్న రజనీశ్​ కుమార్​

అయితే కార్పొరేట్స్‌ ఈ మధ్య కాలంలో అప్పులు అడగట్లేదని రజ్​నీశ్​ పేర్కొన్నారు. స్పెక్ట్రమ్‌ వేలం నిమిత్తం టెలికాం రంగానికి అప్పులిచ్చే విషయాన్ని ప్రస్తావిస్తూ అవి పూర్తిగా అభద్రతతో కూడుకున్న రుణాలని అభిప్రాయం వ్యక్తం చేశారాయన.

"మా వరకు స్పెక్ట్రమ్‌ల కోసం టెలికాం రంగానికి రుణాలివ్వడం అంటే అది పూర్తిగా భద్రత లేనిదే. స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేస్తుంది కనుక పేపర్లపై అది భద్రంగానే ఉంటుంది. కానీ ఆచరణాత్మకంగా చూస్తే ఆ రుణాలు అంత సురక్షితం కావు. ఇందులో రుణాల ఎగవేతకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ రుణాల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి" - రజ్​నీశ్​ కుమార్, ఎస్​బీఐ ఛైర్మన్​

ఇదీ చూడండి: గూగుల్​కు భారీ జరిమానా విధించిన ఫ్రాన్స్​!

ABOUT THE AUTHOR

...view details