తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగుల పోరు బాట... 2 రోజులు బ్యాంకులు బంద్

రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. వేతనాలు పెంచాలని కోరుతూ పలు బ్యాంకు యూనియన్లు జనవరి 31, ఫిబ్రవరి 1న సమ్మెకు దిగనున్నాయి. భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశముంది.

BANKS STRIKE
బ్యాంకుల సమ్మె

By

Published : Jan 30, 2020, 2:55 PM IST

Updated : Feb 28, 2020, 1:06 PM IST

దేశవ్యాప్తంగా రేపటి నుంచి రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. ఈ నెల 31, ఫిబ్రవరి 1న సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్​ బ్యాంక్​ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) ఇది వరకే వెల్లడించింది.

ఇండియన్​ బ్యాంక్ అసోసియేషన్​ (ఐబీఏ)తో ఈ నెల 13న జరిగిన వేతన సమీక్ష చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి యూనియన్లు.

దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల తరఫున యూఎఫ్​బీయూ ఈ చర్చల్లో పాల్గొంది.

సమ్మె నేపథ్యంలో రెండు రోజులపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఎస్​బీఐ సహా పలు బ్యాంకులు సమ్మెపై ఇప్పటికే ప్రకటన చేశాయి.

నిరవధిక సమ్మెకూ సిద్ధం..

ఈ రెండు రోజుల సమ్మె తర్వాత తమ డిమాండ్లను అంగీకరించకుంటే మార్చి 11-13 మధ్య మరోసారి సమ్మెకు దిగనున్నట్లు యూఎఫ్​బీయూ తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్​ 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.

15 శాతం పెంచాలని..

ఐబీయూతో జరిగిన చర్చలో వేతనాలు​ 15 శాతం పెంచాలని యూఎఫ్​బీయూ కోరింది. ఐబీఏ మాత్రం 12.25 శాతం పెంపునకు మాత్రమే సుముఖత చూపించిందని సమాచారం.

ఇదీ చూడండి:ఈ ఏడాది మరింత పెరగనున్న బంగారం ధర!

Last Updated : Feb 28, 2020, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details