తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఖర్చులు '7 రెట్లు' అధికం!

మన దేశంలోని ఆసుపత్రుల్లో.. సాధారణ కుటుంబ చేసే ఖర్చులపై ఓ ఆసక్తికర సర్వే నిర్వహించింది జాతీయ గణాంకాల కార్యాలయం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసే ఖర్చులతో పోల్చితే.. ప్రైవేటు హాస్పిటల్లో చేస్తున్న ఖర్చు దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

మీ ఆస్పత్రి ఖర్చులు తెలుసా

By

Published : Nov 24, 2019, 8:31 AM IST

దేశంలో ఓ సగటు కుటుంబం.. ప్రైవేటు ఆసుపత్రిలో ఖర్చు చేసే మొత్తం.. ప్రభుత్వ ఆసుపత్రితో పోల్చితే 7 రేట్లు ఎక్కువని ఓ సర్వే ప్రకటించింది. 2017 జులై-2018 జూన్​ మధ్యకాలంలో జరిపిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్​ఎస్​ఓ). అయితే ప్రసవాల సమయంలో వెచ్చించే ఖర్చును ఈ సర్వే నుంచి మినహాయించింది.

"ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున రూ.4,452(గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,290, పట్టణ ప్రాంతాల్లో రూ.4,837) ఖర్చు చేస్తున్నారు. అదే ప్రైవేటు దవాఖానల్లో సగటున రూ.31,845 (గ్రామీణ ప్రాంతాల్లో రూ.27,347.. పట్టణ ప్రాంతాల్లో రూ.38,822) ఖర్చు అవుతోంది."
--- ఎన్​ఎస్​ఓ సర్వే.

సాధారణ మెడికల్ ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 16,676.. పట్టణ ప్రాంతాల్లో రూ.26,475గా ఉన్నట్లు సర్వే పేర్కొంది.

ఇంతకు ముందు.. 1995-96, 2004, 2014 ల్లోనూ ఇలాంటి సర్వేలు జరిగాయి.ఈ డేటా ప్రకారం.. ప్రభుత్వాసుపత్రుల్లో చేరేవారి సంఖ్య 42 శాతంగా (శిశు జననాలు మినహాయించి).. ప్రైవేటు హాస్పిటల్లో 55 శాతంగా, చారిటబుల్​ ట్రస్టులు, ఎన్​జీఓలు నడిపే దవాఖానాల్లో చేరేవారి సంఖ్య 2.7 శాతంగా ఉన్నట్లు తెలిసింది.

శిశు జననాల గణాంకాలు ఇలా..

శిశు జనన సమయాల్లో ఆస్పత్రిలో చేరే వారికి.. ప్రభుత్వాసుపత్రుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.2,404, పట్ణణ ప్రాంతాల వారికి రూ.3,106 ఖర్చు అవుతున్నట్లు సర్వేలో తెలిసింది. అదే ప్రైవేటు హాస్పిటల్లో.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20,788.. పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.29,105 ఖర్చు అవుతున్నట్లు సర్వే పేర్కొంది.

ఇందులో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పస్రుతి కోసం చేరేవారికి 17 శాతం మాత్రమే సర్జరీలు చేస్తుండగా.. వాటిలో 92 శాతం వరకు ఉచితంగా సాగుతున్నాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 55 శాతం సర్జరీలు జరుగుతుండగా.. 1 శాతం మాత్రమే ఉచితంగా చేస్తునారని సర్వే పేర్కొంది.

ఇదీ చూడండి:ఉద్దేశపూర్వక ఎగవేతదారుల్లో మెహుల్ ఛోక్సీ కంపెనీ నెం.1

ABOUT THE AUTHOR

...view details