తెలంగాణ

telangana

ETV Bharat / business

2019-20 జీడీపీలో తగ్గనున్న వాహన రంగం వాటా!

2019-20 దేశ జీడీపీలో వాహన రంగం వాటా భారీగా తగ్గే అవకాశముందని ఓ ప్రముఖ సంస్థ నివేదిక వెల్లడించింది. గత కొంత కాలంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. 2018-19 జీడీపీలో 7.5 శాతంగా ఉన్న వాహన రంగం వాటా.. 2019-20లో 7 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది.

2019-20 జీడీపీలో తగ్గనున్న వాహన రంగం వాటా!

By

Published : Nov 1, 2019, 6:00 AM IST

Updated : Nov 1, 2019, 7:19 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సర.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వాహన రంగం వాటా 7 శాతానికి తగ్గే అవకాశాలున్నాయని ఓ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇది 7.5 శాతంగా ఉండటం గమనార్హం.

వాహన రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న కారణంగా.. తయారీదారుల ఆదాయం 6 శాతానికే పరిమితం కావొచ్చని అక్యూట్​ రేటింగ్​ అండ్​ రీసర్చ్​ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

ఈ సర్వే ప్రకారం .. వాణిజ్య, ప్యాసింజర్, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు అన్ని కేటగిరీల్లో వాహనాల అమ్మకాలు 6-7 శాతం మేర తగ్గే అవకాముంది. 2018-19లో.. అన్ని కేటగిరీల్లో 25 మిలియన్ యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం.

ఆదాయం కూడా 2018-19లో గడించిన రూ.3-3.2 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5-6 శాతం తగ్గొచ్చని సర్వే అంచనా వేసింది.

పండుగ సీజన్​లోనూ కోలుకోని పరిశ్రమ..

2026 నాటికి దేశ జీడీపీలో వాహనరంగం వాటా 12 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇదే సమయంలో ఆటోమొబైల్ పరిశ్రమ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు ఏ దశలోనూ కోలుకోలేదు. పండుగ సీజన్​లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదని నివేదిక అభిప్రాయపడింది. పండుగ సీజన్​లో అధిక ఆఫర్లు ప్రకటించినప్పటికీ.. ప్రధాన వాహన తయారీ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోలేకపోయాయని పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు భారీగా తగ్గడం.. ఆటోమొబైల్ పరిశ్రమ మందగమనానికి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది.

ఇదీ చూడండి: వరుస లాభాలు చూసి స్టాక్​ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా?

Last Updated : Nov 1, 2019, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details