తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ ఏటీఎఫ్, ఎల్​పీజీ ధరలు పెంపు - ఎల్​పీజీ

వరుసగా రెండో నెల ఏటీఎఫ్​, ఎల్​పీజీ ధరలు పెంచాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు. ఏటీఎఫ్​పై రూ. 677, రాయితీ లేని వంట గ్యాస్​పై రూ.5 పెంచినట్లు తాజా ప్రకటనలో వెల్లడించాయి.

ఏటీఎఫ్, ఎల్​పీజీ

By

Published : Apr 1, 2019, 7:20 PM IST

ప్రపంచ చమురు ధరల్లో పెరుగుదల కారణంగా ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయల్​(ఏటీఎఫ్) ధర ఒక శాతం పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

ఏటీఎఫ్​ ధరలు పెరగటం వరుసగా ఇది రెండో నెల. దీంతో ప్రస్తుతం కిలో లీటర్​ ఏటీఎఫ్​పై (దిల్లీలో) రూ.677 పెరిగి... రూ.63,472.22 కు చేరింది. ఏటీఎఫ్ ధర గత నెల అత్యధికంగా 8.1 శాతం (రూ.4,734.15) పెరిగింది.

ధరలు పెరగటం... ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విమాన సంస్థలకు భారంగా మారనుంది.

ఇక రాయితీ లేని వంట గ్యాస్​పై రూ.5 పెంచాయి చమురు సంస్థలు. పెరిగిన ధరతో రాయితీ లేని 14.2 కిలోల సిలిండర్​ ధర (దిల్లీలో) రూ.706.50కు చేరింది.

రాయితీ ఇచ్చే వంట గ్యాస్​ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు చమురు సంస్థలు. ప్రస్తుతం దీని ధర రూ.495.86గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details