తెలంగాణ

telangana

ETV Bharat / business

టెక్​ దిగ్గజం ఐబీఎం నూతన సీఈఓగా భారతీయుడు

అమెరికా టెక్​ దిగ్గజాలను నడిపిస్తున్న భారతీయ సారథుల జాబితాలో మరో వ్యక్తి చేరారు. టెక్​ దిగ్గజం ఐబీఎంకు కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన అరవింద్​ కృష్ణ ఎంపికయ్యారు.

ibm
ఐబీఎం సీఈఓ

By

Published : Jan 31, 2020, 11:08 AM IST

Updated : Feb 28, 2020, 3:31 PM IST

అమెరికాకు చెందిన మరో ఐటీ దిగ్గజానికి భారత సంతతికి చెందిన వ్యక్తి సారథ్యం వహించనున్నారు. టెక్​ దిగ్గజం ఐబీఎంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా(సీఈఓ) అరవింద్​ కృష్ట ఎంపికయ్యారు.
ఐబీఎం నూతన సీఈఓ, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా ఎన్నుకుంటూ.. ఇతర సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్​ 6న సీఈఓ బాధ్యతలు తీసుకోనున్నారు కృష్ణ. అరవింద్‌ (57) ప్రస్తుతం కంపెనీ ‘క్లౌడ్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఐబీఎం ప్రస్తుత ఛైర్మన్​, అధ్యక్షురాలు, సీఈఓ గిన్నీ రోమెట్టీ (62) ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ పొందనున్నారు. రోమెట్టీ గత 40 ఏళ్లుగా ఐబీఎంలో పని చేస్తున్నారు. రోమెట్టీ పదవీ విరమణ నేపథ్యంలో అరవింద్​ కృష్ణను తదుపరి సీఈఓగా ఎంపిక చేసింది సంస్థ డైరెక్టర్ల బోర్డు. ఐబీఎం అధ్యక్షుడిగా జిమ్ వైట్​హస్ట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా గిన్నీ కొనసాగనున్నారు.

ఆయనే సమర్థులు..

ప్రపంచ టెక్ ​దిగ్గజంగా వెలుగొందుతున్న ఐబీఎంకు తదుపరి సీఈఓగా అరవింద్​ కృష్ణ సమర్థులని రోమెట్టీ అన్నారు. ఐబీఎం నవ శఖానికి ఆయనే సరైన సారథిగా అని కొనియాడారు. రెడ్​ హ్యాట్​ వంటి ఇతర కంపెనీలను సంస్థలను స్వాధీనం చేసుకోవడంలో అరవింద్ పాత్ర కీలకమైనదిగా ఆమె తెలిపారు.

భారత సంతతి టెక్​ సారథుల జాబితా..

ప్రపంచ టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ సీఈఓగా సత్యనాదెళ్ల, గూగుల్​, ఆల్ఫాబెట్​ సీఈఓగా సుందర్​పిచాయ్, మాస్టర్​కార్డ్​ సీఈఓగా అజయ్​ బంగ, అడోబ్​ సీఈఓగా శంతనూ నారాయణ్​లు ఉన్నారు. మరో దిగ్గజ సంస్థ పెప్సికోకు ఇంద్రనూయి గతంలో సీఈఓగా పని చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో అరవింద్ కృష్ణ చేరారు.

ఐబీఎంతో అరవింద్​ ప్రయాణం..

1990 నుంచి ఐబీఎంలో ఉన్నారు అరవింద్​ కృష్ణ. ఐఐటీ కాన్పుర్​ నుంచి డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్​ ఇల్లినాయిస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్​లో పీహెచ్​డీ పొందారు.

గొప్ప గౌరవం..

ఐబీఎం సీఈఓ పదవికి ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు అరవింద్​ కృష్ణ తెలిపారు.

"ఐబీఎం తదుపరి సీఈఓగా ఎన్నికవ్వడం పట్ల నేను గౌరవంగా భావిస్తున్నాను. గిన్నీ, ఇతర బోర్డు సభ్యులు నా పై నమ్మకం ఉంచడం అభినందనీయం." - అరవింద్ కృష్ణ

ఇదీ చూడండి:పార్లమెంటు ఉభయ సభల్లో నేడే ఆర్థిక సర్వే

Last Updated : Feb 28, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details