తెలంగాణ

telangana

ETV Bharat / business

యాపిల్ నుంచి బడ్జెట్ ఐఫోన్ విడుదల​.. ధరెంతో తెలుసా? - యాపిల్ కొత్త ఐఫోన్

ప్రముఖ స్మార్ట్​ఫోన్ సంస్థ యాపిల్ తన కొత్త ఐఫోన్​ 'ఎస్​ఈ-2020'ను ఆవిష్కరించింది. బడ్జెట్​ ప్రియుల కోసం తీసుకొచ్చిన ఈ మోడల్​లో అధునాతన ఫీచర్లను అందిస్తోంది. భారత్​లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.. ధర వంటి వివరాలు మీకోసం..

iPhone SE 2020
యాపిల్ నుంచి బడ్జెట్ ఐఫోన్

By

Published : Apr 16, 2020, 4:46 AM IST

Updated : Apr 16, 2020, 8:26 AM IST

స్మార్ట్​ ఫోన్ దిగ్గజం​ యాపిల్ తన బడ్జెట్​ రేంజ్​​ ఐఫోన్​ 'ఎస్​ఈ 2020'ను ఆవిష్కరించింది. 2016లో విడుదలైన ఐఫోన్​ ఎస్​ఈకి అప్​డేట్​ వెర్షన్​గా 'ఎస్​ఈ 2020' వస్తోంది.

మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు బడ్జెట్​ ఫోన్లపై దృష్టి పెట్టింది యాపిల్. ఇందుకోసం మూడేళ్ల క్రితం ఐఫోన్​ ఎస్​ఈని విడుదల చేసింది. చిన్న సైజులో ఈ ఫోన్​ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం విడుదల చేసిన ఎస్​ఈ-2020లోనూ అధునాతన ఫీచర్లను జోడించింది యాపిల్.

మూడు వేరియంట్లలో..

ఈ ఫోన్​ను 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ వేరియంట్ల రూపంలో అందిస్తోంది యాపిల్​. నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లోనూ లభించనుంది. అయితే ఐఫోన్​ X తో టచ్ ​ఐడీకి ముగింపు పలికిన యాపిల్​.. మళ్లీ ఎస్​ఈలో ఈ సౌకర్యాన్ని కల్పించింది.

వాటర్ రెసిస్టెంట్..

ఇందులో ఐఫోన్​ 11, 11 ప్రో, 11ప్రో మ్యాక్స్​లో వాడిన అధునాతన ఏ13 బయోనిక్ చిప్​ను అమర్చింది యాపిల్. అంతేకాకుండా ఐపీ67 గుర్తింపు ఉన్న వాటర్​, డస్ట్ రెసిస్టెంట్​ సదుపాయం కల్పించింది.

మరిన్ని ప్రత్యేకతలు

  • 4.7 అంగుళాల​ ఎల్​సీడీ తెర
  • 3 జీబీ ర్యామ్
  • వెనుక కెమెరా 12 ఎంపీ (5x జూమ్​, 6 పొట్రెయిట్ మోడ్స్​​, అడ్వాన్స్​డ్ బొకె, డెప్త్​ కంట్రోల్ ఫీచర్లు)
  • 4కే వీడియో సపోర్ట్
  • ముందు కెమెరా 7 ఎంపీ
  • బ్లూటూత్ 5.0
  • ప్రారంభ ధర (అమెరికా) 399 డాలర్లు

అయితే భారత్​లో ఈ ఫోన్​ ఎప్పటి నుంచి లభిస్తుందనే సమాచారాన్ని యాపిల్ వెల్లడించలేదు. అధికారిక సమాచారం ప్రకారం భారత్​లో ప్రాథమిక వేరియంట్ ధర రూ.42,500 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది యాపిల్​.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ ఉన్నా కొత్త కారు కొనుక్కోండిలా...

Last Updated : Apr 16, 2020, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details