తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2019, 5:06 PM IST

ETV Bharat / business

ఆర్​కామ్​ డైరెక్టర్​ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

ఆర్​కామ్​ డైరెక్టర్​ పదవికి అనిల్​ అంబానీ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నట్లు ఆర్​కామ్ అధికారికంగా ప్రకటించింది.

అనిల్​ అంబానీ

భారీ అప్పుల్లో చిక్కుకున్న రిలయన్స్ కమ్యునికేషన్స్​​ (ఆర్​కామ్​) డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఫైలింగ్​లో పేర్కొంది.

అనిల్​ అంబానీతో పాటు.. ఇతర డైరెక్టర్లు ఛాయా వీరణి, రీనా కరణి, మంజరీ కాకర్, సురేశ్​ రంగాచర్​లు రాజీనామా చేసినట్లు ఆర్​కామ్ వెల్లడించింది.

ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్న ఆర్​కామ్.. 2019-20 రెండో త్రైమాసికంలో.. రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. బకాయిలు చెల్లించలేని కారణంగా అ సంస్థ ఇప్పటికే తన మొబైల్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి: ఈ 10 అంశాలపై గూగుల్​లో అస్సలు వెతకొద్దు..!

ABOUT THE AUTHOR

...view details