తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగం మానేస్తే అమెజాన్​ బంపర్​ ఆఫర్​ - మానేస్తే

అమెజాన్... ఈ-కామర్స్​ దిగ్గజం. అలాంటి సంస్థలో ఉద్యోగం అంటే మామూలు విషయమా? కానీ... ఆ ఉద్యోగం మానేయమంటోంది అమెజాన్​. ఇంటింటికీ తిరిగి, వస్తువులు డెలివరీ ఇచ్చే పని చేసుకోమంటోంది. అలా చేసేవారికి బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. ఎందుకలా? ఏంటా ఆఫర్​??

అమెజాన్​

By

Published : May 14, 2019, 10:06 AM IST

సంస్థ ఉద్యోగుల ముందు ఓ ప్రతిపాదన ఉంచింది అమెజాన్​.​ "ఉద్యోగం మానేయండి.. సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సాయం చేస్తాం" అని ప్రకటించింది. అమెజాన్​ ఆర్డర్లను వినియోగదారులకు చేరవేడమే ఆ వ్యాపారం.

కారణమిదే..

ఆర్డర్లను వినియోగదారులకు మరింత వేగంగా అందించాలని అమెజాన్​ ప్రయత్నిస్తోంది. ప్రైమ్​ సభ్యులకు ప్రస్తుతం రెండు రోజుల్లోగా వస్తువులను డెలివరీ చేస్తోంది. ఒకరోజులోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఎక్కువ డెలివరీలు చేసిన వారికి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అమెజాన్​ యోచిస్తోంది.

10వేల డాలర్లు...

ఉద్యోగం మానేసి అమెజాన్​ ఉత్పత్తుల డెలివరీ వ్యాపారం చేయాలనుకునేవారికి 10వేల డాలర్ల వరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది ఆ సంస్థ​. మూడు నెలల వేతనాన్నీ చెల్లించనుంది. ఫుల్​టైమ్​, పార్ట్​టైమ్​ ఉద్యోగులతో పాటు ఆర్డర్లను ప్యాక్​ చేసి, వినియోగదారులకు అందించే వేర్​హౌస్​ ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది అమెజాన్​.

ఎంత మంది ఉద్యోగులు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారనే అంచనాలను చెప్పేందుకు ఆ సంస్థ నిరాకరించింది.

ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు

అమెజాన్​ డెలివరీ వ్యాపారం ప్రారంభించేందుకు ఆసక్తిగల వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని అమెజాన్​ ప్రకటించింది. ఆర్డర్లను వినియోగదారులకు అందించేందుకు పోస్టాఫీసులు, పార్సిల్​ సర్వీసులపై ఆధారపడకూడదని భావిస్తోంది ఆ సంస్థ. అందుకే ఈ కార్యక్రమం చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details