తెలంగాణ

telangana

ETV Bharat / business

దసరాకు అదిరే ఆఫర్లతో ఫ్లిప్​కార్ట్, అమెజాన్​! - ప్రత్యేక ఆఫర్లు

పండుగ సీజన్​లో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి వ్యాపార సంస్థలు. ముఖ్యంగా ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్​కార్ట్, అమెజాన్​లు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ దిగ్గజాలు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నాయో తెలుసుకోండి.

దసరా దిస్కౌంట్లు

By

Published : Sep 28, 2019, 11:13 AM IST

Updated : Oct 2, 2019, 7:58 AM IST

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్​కార్ట్, అమెజాన్​లు ప్రకటించిన పండుగ సీజన్ ఆఫర్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్​ ఇండియా ఫెస్టివల్ ఆఫర్లు ఈ నెల 29 నుంచి అక్టోబర్​ 4 వరకు అందుబాటులో ఉండనున్నాయి. మరి ఈ రెండు సంస్థల ప్రత్యేక ఆఫర్లేంటో తెలుసుకోండి ఇప్పుడే.

ఫ్లిప్​కార్ట్ 'బిగ్​ ​బిలియన్​ డేస్' ఆఫర్లు..

ఈ ప్రత్యేక ఆఫర్​లో అన్ని కేటగిరీల్లోని ఉత్పత్తులపై డిస్కౌంట్‌ అందిస్తోంది ఫ్లిప్​కార్ట్​. అయితే మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై.. డిస్కౌంట్లను సేల్‌ ప్రారంభమైన ఒక రోజు తర్వాత (సెప్టెంబర్‌ 30న) ప్రకటించనుంది.

బిగ్​బిలియన్​ డేస్​ ఆఫర్​ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకులతో కలిసి 10 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్​కార్ట్ వెల్లడించింది. ఫ్లిప్​కార్ట్​లో మొదటి సారి గృహోపకరణాలపై బీమా అందిస్తున్నట్లు తెలిపింది.

ఫ్లిప్​కార్ట్ ​ప్లస్ చందాదారులకు ఈ ఆఫర్​ నాలుగు గంటల ముందే వినియోగించుకునేందుకు వీలు కలిపిస్తున్నట్లు తెలిపింది. ఈ సారి సేల్‌లో తొలిసారిగా చేతి వృత్తిదారులు, చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించే సదుపాయాన్ని కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌.

అమెజాన్ గ్రేట్​ ఇండియా ఫెస్టివల్​ ఆఫర్లు...

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్​ ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు ప్రైమ్ వినియోగదారులకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచే అందుబాటులోకి రానున్నాయి. సాధారణ యూజర్లకు అర్ధరాత్రి నుంచి ఆఫర్లు వినియోగించే అవకాశం కల్పిస్తోంది అమెజాన్​.

ఫ్లిప్​కార్ట్​కి పోటీగా.. స్మార్ట్​ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనుంది అమెజాన్. వీటితో పాటు వన్​ప్లస్​ టీవీ, వన్​ప్లస్​ స్మార్ట్​ ఫోన్ సహా పలు ప్రత్యేక బ్రాండ్లను పరిచయం చేయనుంది అమెజాన్​.

ఎస్​బీఐ డెబిట్​కార్డ్​తో కొనుగోలు చేసేవారికి 10 శాతం అదనపు తగ్గింపు ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చూడండి: బంపర్​ ఆఫర్​: మారుతీ 'బాలెనో ఆర్​ఎస్'​పై భారీ తగ్గింపు

Last Updated : Oct 2, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details