తెలంగాణ

telangana

ETV Bharat / business

'బ్యాంకింగ్​లోకి కార్పొరేట్లు' ఆర్బీఐ నిర్ణయం కాదు: దాస్​ - governer shaktikanta das

కార్పొరేటు సంస్థల బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదనలపై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) స్పందించింది. అది ఆర్​బీఐ అభిప్రాయం కాదని, బ్యాంకింగ్​ రంగంలోకి కార్పొరేటు సంస్థలకు అనుమతివ్వడం కేంద్ర బ్యాంకు అంతర్గత కమిటీ అభిప్రాయమని గవర్నర్​ శక్తికాంతదాస్​ స్పష్టం చేశారు.

Allowing corporates to start banks
బ్యాంకింగ్​లోకి కార్పొరేట్లు ఆర్​బీఐ నిర్ణయం కాదు: దాస్​

By

Published : Dec 4, 2020, 9:42 PM IST

బ్యాంకింగ్‌ రంగంలోకి కార్పొరేట్‌ సంస్థలకు అనుమతివ్వడం భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) అభిప్రాయం కాదని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. అది కేవలం కేంద్ర బ్యాంకు అంతర్గత కమిటీ అభిప్రాయమని స్పష్టం చేశారు. నిపుణులు, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

కొత్త బ్యాంకులు పెట్టేందుకు కార్పొరేట్లకు అనుమతి ఇవ్వాలని ఆర్‌బీఐ అంతర్గత కమిటీ కొన్నిరోజుల క్రితం అభిప్రాయం వెలుబుచ్చింది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మూలధనం, బ్యాంకింగ్‌ చట్టంలో మార్పులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బ్యాంకులుగా మారడం గురించి పలు సూచనలు చేసింది. అయితే కార్పొరేట్లకు అనుమతి ఇవ్వాలన్న సూచనలపై నిపుణులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బ్యాంకింగ్‌ రంగంపై ఇదొక పిడుగుపాటని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అభ్యంతరం వ్యక్తం చేశారు.

'అది ఆర్బీఐ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక. దానినే ఆర్బీఐ తుది నిర్ణయం లేదా అభిప్రాయంగా పరిగణించొద్దు. ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి. కమిటీ చెప్పిన సూచనలపై కేంద్ర బ్యాంకు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ప్రజాభిప్రాయం స్వీకరించాకే ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆర్​బీఐ ఎంపీసీ నిర్ణయాలపై నిపుణుల హర్షం

ABOUT THE AUTHOR

...view details