గంటలోనే లోన్! సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం కేంద్రప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమిది. ఇందుకోసం గతేడాది నవంబర్‌లో "PSBloansin59minutes.com" పేరిట ఆన్లైన్ రుణ సంస్థను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. తొలి 3 నెలల్లోనే రూ.35,000 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసింది ఈ సంస్థ. దేశంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ లెండింగ్ ప్లాట్‌ఫాంగా నిలిచింది.
కేంద్ర ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ ప్లాట్‌ఫాంను రూపొందించారు. ఎంఎస్ఎంఈలకు రుణాల మంజూరుకు ఇంతకుముందు 20-25 రోజులు పట్టేది. ఇప్పుడు 59 నిమిషాలు లేదా గంటలోపే రుణాల మంజూరు ప్రక్రియ పూర్తవుతోంది. ఇలా మంజూరైన రుణాల మొత్తం 7-8 పని దినాల్లో లబ్ధిదారులకు చేరుతున్నాయి.