తెలంగాణ

telangana

ETV Bharat / business

అంకురాలకు వాట్సాప్ ఆర్థిక ప్రోత్సాహం

సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ 'స్టార్టప్ ఇండియా-వాట్సాప్ గ్రాండ్ చాలెంజ్' పేరుతో పోటీలు నిర్వహించి పోటీలో 5 అంకుర సంస్థలను విజేతలుగా ప్రకటిచింది. వీటికి రూ.35 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు వెల్లడించింది.

వాట్సాప్

By

Published : Jun 19, 2019, 12:48 PM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ అనుబంధ సంస్థ 'వాట్సాప్​' భారత్​లో ఉత్తమ అంకురాలకు ఆర్థిక ప్రోత్సహం అందించే చర్యలు వేగవంతం చేసింది.

ఈ ఏడాది ప్రారంభంలో "స్టార్టప్ ఇండియా-వాట్సాప్​ గ్రాండ్ చాలెంజ్​" పేరుతో వాట్సాప్​ నిర్వహించిన పోటీ ద్వారా ఐదు స్టార్టప్​లను విజేతలుగా ఎంపిక చేసినట్లు తెలిపింది. విజేతలుగా నిలిచిన అంకురాలకు రూ.35 లక్షల చొప్పున మొత్తం రూ.1.75 కోట్ల ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు పేర్కొంది.

ఈ పోటీకి 25 రాష్ట్రాల నుంచి 1,700 అంకురాలు నమోదు చేసుకోగా 10 సంస్థలను షార్ట్​లిస్ట్​ చేసి... వాటి నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 5 అంకురాలను విజేతలుగా ఎంపిక చేసినట్లు వాట్సాప్ ఇండియా అధిపతి అభిజిత్ బోస్ వెల్లడించారు.

విజేతలుగా నిలిచిన అంకురాలు ఇవే

  • మెడ్​కార్డ్స్-ఇది ఆరోగ్య సాంకేతికత అందించే అంకురం
  • మేల్జో-వర్చువల్ రియాలిటీ అంకురం
  • జవీస్​-వాట్సాప్ ఆధారిత కృత్రిమ మేధపై పనిచేసే అంకురం
  • గ్రామోఫోన్​-వ్యవసాయ సాంకేతిక అంకురం
  • మినియన్ ల్యాబ్స్​- విద్యుత్ వ్యయాలు తగ్గించుకునే సాంకేతికతను అందించే అంకురం

ABOUT THE AUTHOR

...view details