ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ ద్వారా నిమిషానికి మూడు నియామకాలు అవుతున్నట్లు.. దాని మాతృసంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తెలిపారు.
చాలా మంది ప్రొఫెషనల్స్ తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు లింక్డ్ ఇన్ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. వారంతా వారానికి 10 లక్షల గంటల కంటెంట్‌ను చూస్తున్నారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా అధికమని వివరించారు.