తెలంగాణ

telangana

ETV Bharat / business

Zycov-D Vaccine: సెప్టెంబర్​ నుంచి జైకోవ్​-డి టీకా! - zycov d vaccine cost

జైకొవ్‌-డి టీకా(Zycov-D Vaccine) ధరపై వచ్చేవారం స్పష్టత ఇస్తామని జైడస్‌ గ్రూప్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ తెలిపారు. సెప్టెంబరు మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభిస్తామని, అక్టోబరు నుంచి నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.

Zydus Cadila vaccines to begin commercial rollout from mid-Sep
'సెప్టెంబర్​ నుంచి జైకోవ్​-డి టీకా.. ధరపై వచ్చే వారం స్పష్టత'

By

Published : Aug 21, 2021, 4:13 PM IST

Updated : Aug 21, 2021, 4:36 PM IST

భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి పొందిన జైకొవ్‌-డి టీకా(Zycov-D Vaccine) ధరను వచ్చే వారం నిర్ణయిస్తామని జైడస్‌ గ్రూప్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ వెల్లడించారు. టీకాకు అనుమతులు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. జైకోవ్‌-డి టీకా కరోనా వైరస్‌పై 66 శాతం సమర్థతతో పనిచేస్తుందన్నారు.

ఈ టీకాను ఒక్కో డోసుకు 28 రోజుల వ్యవధితో మూడు డోసులుగా తీసుకోవాలి. 12ఏళ్ల పైబడిన వారికి ఈ టీకా ఇచ్చేందుకు అనుమతులు లభించాయి. వ్యాక్సిన్‌ ధరపై వచ్చే వారంలో స్పష్టతనిస్తామని, సెప్టెంబరు మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభిస్తామని శార్విల్‌ పటేల్‌ తెలిపారు. అక్టోబరు నుంచి నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించినట్లు వివరించారు.

జైకొవ్‌-డి వ్యాక్సిన్‌(Zycov-D Zydus Cadila) దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో టీకా. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. ఈ టీకాను నేరుగా చర్మంలోకి ఎక్కిస్తారు. ఇందుకోసం సూది అవసరం ఉండదు. నొప్పి లేకుండా ఫార్మాజెట్‌ అనే సాధనం ద్వారా దీన్ని ఎక్కిస్తారు.

ఇదీ చూడండి:బంగారానికి ఎందుకంత డిమాండ్​? ధర ఎవరు నిర్ణయిస్తారు?

Last Updated : Aug 21, 2021, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details