తెలంగాణ

telangana

ETV Bharat / business

గురువారం నుంచి జైడస్ వ్యాక్సిన్ 2వ దశ ట్రయల్స్ - జైకోవ్ డీ వ్యాక్సిన ట్రయన్స్ విజయవంతం

దేశీయంగా కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్న జైడస్ క్యాడిలా మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసింది. ఆగస్టు 6 నుంచి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.

Zydus Cadila clinical trials Success
కరోనా వాక్సిన ట్రయల్స్ మొదటి దశ విజయవంతం

By

Published : Aug 5, 2020, 1:26 PM IST

దేశీయ ఫార్మా సంస్థ జైడస్​ క్యాడిలా కరోనా వ్యాక్సిన్ (జైకొవ్​-డీ) మొదటి దశ క్లినికల్​ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఈ మేరకు జైడస్​ క్యాడిలా బుధవారం ప్రకటన విడుదల చేసింది. మొదటి దశ ట్రయల్స్​లో తమ వ్యాక్సిన్ సురక్షితంగా తేలినట్లు పేర్కొంది.

ఆగస్టు 6 నుంచి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు జైడస్​ క్యాడిలా వెల్లడించింది.

జులై 15న ఈ సంస్థ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించింది. వలంటీర్లకు డోసు ఇచ్చిన తర్వాత 24 గంటలపాటు వారిని ఫార్మకోలజికల్ యూనిట్​ నిశింతంగా పర్యవేక్షించినట్లు తెలిపింది జైడస్. ఆ తర్వాత మరో 7 రోజులు వలంటీర్లను తమ పర్యవేక్షణలో ఉంచి.. వ్యాక్సిన్ సురక్షితమేనని నిర్ధరణకు వచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:ఐటీఆర్​ల స్క్రూట్నీ భారీగా తగ్గించిన ఆర్థిక శాఖ

ABOUT THE AUTHOR

...view details