తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడే జొమాటో షేర్ల నమోదు

జొమాటో లిమిటెడ్‌ షేర్లు స్టాక్​ఎక్స్ఛేంజీల్లో శుక్రవారం నమోదుకానున్నాయి. ఇందుకోసం షేర్ల కేటాయింపు ప్రక్రియను సంస్థ గురువారమే పూర్తి చేసింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరును రూ.75 ప్రీమియంతో రూ.76 చొప్పున కంపెనీ కేటాయించింది.

Zomoto list its shares
జొమాటో

By

Published : Jul 23, 2021, 5:20 AM IST

జొమాటో లిమిటెడ్‌ షేర్లు నేడు (శుక్రవారం) స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. వాస్తవానికి జొమాటో షేర్లు 27న (మంగళవారం) నమోదు కావాల్సి ఉండగా.. 2 పనిదినాల ముందుకు జరపడం గమనార్హం. ఇందుకోసం షేర్ల కేటాయింపు ప్రక్రియను సంస్థ గురువారమే పూర్తి చేసింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరును రూ.75 ప్రీమియంతో రూ.76 చొప్పున కంపెనీ కేటాయించింది.

'2021, జులై 23న జొమాటో ఈక్విటీ షేర్లు నమోదవుతాయి. బి- గ్రూపు సెక్యూరిటీస్‌ గ్రూపులో ఈ షేర్ల ట్రేడింగ్‌కు అనుమతినిచ్చామ'ని బీఎస్‌ఈ తెలిపింది. గత శుక్రవారం (16న) ముగిసిన జొమాటో ఐపీఓకు 40.38 రెట్ల స్పందన లభించింది. 2020 మార్చి తర్వాత (ఎస్‌బీఐ కార్డ్స్‌- రూ.10,341 కోట్లు) అధిక నిధులు సమీకరించిన ఐపీఓ ఇదే. దాఖలైన బిడ్ల విలువ రూ.2.13 లక్షల కోట్లు కాగా, 11 ఏళ్ల మార్కెట్‌ చరిత్రలోనే ఇది అధికమని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details